Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోవిడ్ వ్యాక్సిన్లు 2021 ప్రథమార్థంలోనూ రాలేవు.. డబ్ల్యూహెచ్ఓ

కోవిడ్ వ్యాక్సిన్లు 2021 ప్రథమార్థంలోనూ రాలేవు.. డబ్ల్యూహెచ్ఓ
, గురువారం, 23 జులై 2020 (12:29 IST)
కోవిడ్ వ్యాక్సిన్లు 2021 ఆరంభంలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం వుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఎమర్జెన్సీ ప్రోగ్రామ్ డైరెక్టర్‌ మైక్ రయాన్ తెలిపారు. కోవిడ్ వ్యాక్సిన్లను అభివృద్ధి చేయడంలో పరిశోధకులు మంచి పురోగతి సాధిస్తున్నారని చెప్పారు. వ్యాక్సిన్ పంపిణీలో అందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వాస్తవ దృష్టితో చూస్తే 2021 ప్రథమార్థంలో గానీ టీకా మనకు అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని పేర్కొన్నారు. 
 
అప్పటివరకు కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు అన్నిదేశాలు కృషి చేయాలని వెల్లడించారు. కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి అదుపులోకి వచ్చేవరకు పాఠశాలు తిరిగి తెరవడంపై ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
 
ప్రపంచవ్యాప్తంగా రోజువారీ కొత్త కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయని వెల్లడించారు. ఇప్పటికే అనేక టీకాలు క్లీనికల్ ట్రయల్స్‌లోని మూడో దశకు చేరుకున్నాయని తెలిపారు. కాగా, రోగ నిరోధక శక్తిని ప్రేరేపించడం, భద్రత విషయంలో ఇప్పటివరరకూ ప్రతికూల ఫలితాలు రాలేదన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వణికిపోయిన అలస్కా - ప్రాణనష్టం లేదు కానీ...