Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నూతన వేసవి కలెక్షన్‌తో హింద్‌వేర్‌ అప్లయెన్సస్‌

Advertiesment
hindware
, మంగళవారం, 17 మే 2022 (22:17 IST)
హింద్‌వేర్‌ అప్లయెన్సస్‌ ఇటీవలనే విస్తృతశ్రేణిలో ఉత్పత్తులను తమ ఎయిర్‌ కూలర్లు, ఫ్యాన్స్‌ విభాగంలో విడుదల  చేసింది. ఈ వేసవి సీజన్‌లో ఎయిర్‌ కూలింగ్‌ పరిష్కారాల పరంగా తమ ప్రస్తుత జాబితాను విస్తరించడం లక్ష్యంగా చేసుకుంది.
 
ఈ నూతన ఉత్పత్తి శ్రేణిలో హింద్‌వేర్‌ పవర్‌స్ట్రామ్‌ శ్రేణి ఎయిర్‌కూలర్లు ఉన్నాయి. వీటిలో హానీకాంబ్‌ ప్యాడ్స్‌, బ్యాక్టో షీల్డ్‌ టెక్నాలజీ, 4వే ఎయిర్‌ డిఫ్లెక్షన్‌, శక్తివంతమైన మోటర్‌ ఉన్నాయి. దీనిలో ప్రత్యేకమైన 5లీఫ్‌, 18 డిగ్రీ అల్యూమినియం బ్లేడ్‌ డిజైన్‌ ఉంది. ఇది పరిశ్రమలో వినూత్నం. ప్రస్తుత శ్రేణి ఎయిర్‌కూలర్లకు హింద్‌వేర్‌ పవర్‌స్ట్రామ్‌ ఎయిర్‌ కూలర్లు జోడించడంతో తమ పోర్ట్‌ఫోలియోను మరింత బలంగా, పోటీతత్త్వంతో మలుస్తుంది.
 
సమాంతరంగా, హింద్‌వేర్‌ అప్లయెన్సస్‌ తమ ఫ్యాన్లను విడుదల చేసిన కొద్ది కాలంలోనే 250కు పైగా ఎస్‌కెయుల జాబితాను కలిగి ఉంది. ఈ బ్రాండ్‌ ఇటీవలనే సూపర్‌ ప్రీమియం, ప్రీమియం, ఎనర్జీ సేవింగ్‌ సీలింగ్‌ ఫ్యాన్స్‌తో పాటుగా పోర్టబల్‌, పెడస్టల్‌, వాల్‌ ఫ్యాన్లను సైతం అందిస్తుంది. ఈ నూతన శ్రేణిలో  విభిన్నమైన రంగులు ఉండటంతో పాటుగా అతి సులభంగా శుభ్రపరుచుకోగల డస్ట్‌ రెసిస్టెన్స్‌ బ్లేడ్స్‌ , అత్యున్నత పెర్‌ఫార్మెన్స్‌ మోటర్‌, డబుల్‌ బాల్‌ బేరింగ్‌ వంటివి ఉంటాయి. సూపర్‌ ప్రీమియం ఫ్యాన్లు హింద్‌వేర్‌ జువో, హింద్‌వేర్‌ డెల్టో మోడల్స్‌ మినిమలిస్టిక్‌ డిజైన్‌తో రావడంతో పాటుగా ఎలకో్ట్రప్లేటెడ్‌ యాంటిక్‌ ఫినీష్‌ కలిగి ఉంటాయి.
 
సొమానీ హోమ్‌ ఇన్నోవేషన్‌ లిమిటెడ్‌ సీఈవో అండ్‌ హోల్‌ టైమ్‌ డైరెక్టర్‌ రాకేష్‌ కౌల్‌ మాట్లాడుతూ,‘‘ఆర్‌ అండ్‌ డీలో  మేము మా పెట్టుబడులు కొనసాగించడంతో పాటుగా వినియోగదారుల ఆశలకు అనుగుణంగా ఉత్పత్తులు విడుదల చేస్తున్నాము. మా కూలింగ్‌ అప్లయెన్సస్‌ జాబితాపై ఉన్న ఉత్సాహభరితమైన ప్రతిస్పందనతో మరింతగా మేము మా ఆఫరింగ్‌ విస్తరించడంతో పాటుగా ఎకో డెకో, ప్రీమియం శ్రేణి ఫ్యాన్లకు మరిన్ని ఎస్‌కెయులు జోడించేందుకు ప్రోత్సహించింది. ఎయిర్‌కూలర్స్‌ విభాగంలో పవర్‌ స్ట్రామ్‌ శ్రేణిపై మా దృష్టిని కొనసాగిస్తున్నాము’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎవరెస్ట్ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించిన పర్వతారోహకురాలు అన్విత రెడ్డి