Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నూతన స్ర్పింగ్‌- సమ్మర్‌ కలెక్షన్‌ ఆవిష్కరణతో వేడుక చేస్తోన్న లైఫ్‌స్టైల్‌

Advertiesment
నూతన స్ర్పింగ్‌- సమ్మర్‌ కలెక్షన్‌ ఆవిష్కరణతో వేడుక చేస్తోన్న లైఫ్‌స్టైల్‌
, సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (21:46 IST)
తాజా ధోరణులకు అగ్రగామి ఫ్యాషన్‌ కేంద్రంగా వెలుగొందుతున్న లైఫ్‌స్టైల్‌ తమ స్ర్పింగ్‌/సమ్మర్‌ కలెక్షన్‌ను నేడు ఆవిష్కరించింది. అత్యున్నత ఫ్యాషన్‌ సౌందర్య, వేసవి రంగుల ఖచ్చితమైన సమ్మేళనంతో కూడిన ఈ నూతన కలెక్షన్‌ ఖచ్చితంగా విలువైనది మరియు ఆనందాన్ని కలిగించే ధరలలో లభిస్తుంది.

 
ఈ నూతన కలెక్షన్‌తో, శైలి మరియు సౌలభ్యం పరంగా అత్యున్నతంగా ఉండే వైవిధ్యమైన క్రియేషన్స్‌ చేయడంతో పాటుగా ఫ్యాషన్‌ షాపర్ల ప్రస్తుత మైండ్‌ స్పేస్‌ను ప్రతిధ్వనిస్తుంది. ఇంటి నుంచి పనిచేయడం లేదా ఫిట్‌నెస్‌పై పనిచేయడం లేదా స్నేహితులు, కుటుంబసభ్యులతో ఆనందంగా గడిపే సమయం, ఏదైనా సరే ఈ నూతన కలెక్షన్‌ మీకు తగిన ఆనందానుభూతులను అందిస్తుంది. వస్త్రాలు, పాదరక్షలు, హ్యాండ్‌బ్యాగ్‌లు మరియు మరెన్నో  విభాగాలలో ఆధునిక ధోరణులతో  ఉత్సాహపూరితమైన, ఆహ్లాదకరమైన అనుభూతులను కలిగించే ఫ్యాషన్‌గా మారే అవకాశం ఈ కలెక్షన్‌ను మహోన్నత ధరలు వద్ద వినియోగదారులు కోరదగినదిగా మారుస్తుంది.

 
లైఫ్‌స్టైల్‌ యొక్క స్ర్పింగ్‌/సమ్మర్‌ శ్రేణి అతి సున్నితంగా ఉండటంతో పాటుగా సరైన రంగులు, ప్రింట్లు, సిల్‌హ్యుటీస్‌ సమ్మేళనంతో ఖచ్చితంగా ఈ సీజన్‌ యొక్క ఆనందాన్ని ఒడిసిపడుతుందనే వాగ్ధానం చేస్తుంది. మహిళా కొనుగోలుదారులు ఫ్లోరల్‌ మ్యాక్సీ లెంగ్త్‌ గౌన్లు, వేసవి రంగులైనటువంటి లిలాక్‌, బట్టర్‌ ఎల్లో, ఫ్యూశ్చియా పింక్‌ మరియు మరెన్నో టియర్డ్‌ డ్రెస్‌లు ఖచ్చితంగా క్యాజువల్‌ డేను ప్రకాశవంతం చేయడంతో పాటుగా ఒకరి లుక్స్‌ను కష్టపడకుండానే అద్భుతంగా మార్చవచ్చు.

 
ఆకర్షణీయమైన ఆఫ్‌ షోల్డర్స్‌, స్లిట్‌ అండ్‌ బస్టియర్‌ డ్రెస్‌లు, వేసవిలో ఎక్కువమంది అభిమానించే క్రోచెట్‌ డ్రెస్‌లు, శాటిన్‌ మరియు టై-డై ప్రింట్‌లలో ఫెమినైన్‌ సిల్‌హ్యుటీస్‌ మరియు పార్టీ లుక్‌ కోసం టై అండ్‌ డై ప్రింట్‌లు వంటివి ఈ కలెక్షన్‌లో ఉన్నాయి. ఈ డ్రెస్‌లు 699 రూపాయల ప్రారంభ ధరతో లభ్యమవుతాయి.

 
రోజంతా సౌకర్యం అందించే కాటన్స్‌ మరియు లినెన్స్‌ లేదా నిట్టెడ్‌ షర్ట్స్‌ మరియు ట్రౌజర్లతో విలాసవంతమైన వర్క్‌ వేర్‌ మరియు క్లాసీ లుక్‌తో మగవారు ఆకర్షణీయంగా కనిపించవచ్చు. కోడ్‌ నుంచి పూర్తి సరికొత్త మూమెంటమ్‌ సిరీస్‌, ప్రతి కదలికనూ స్వీకరించే సౌకర్యవంతమైన గార్మెంట్‌లా ఉండటంతో పాటుగా శైలి మరియు సౌకర్యం యొక్క సరైన సమ్మేళనంగా ఉంటంది మరియు భిన్నంగానూ వీరిని నిలుపుతుంది. సాహస ప్రేమికుల కోసం, దీనిలో 24/7 హైపర్‌ డెనిమ్స్‌ అత్యున్నత సాంకేతికత ఉంది. ఇది వీకెండ్స్‌కు ఖచ్చితంగా సరిపోతుంది.

 
మీ ఫిట్‌నెస్‌ లక్ష్యాలకు ఆకర్షణీయమైన రంగులను అందించేందుకు, మహిళల కోసం పింక్‌, బ్లూ మరియు ఎల్లో రంగుల్లో అథ్లీజర్‌ వేర్‌ ఉంది. ఇవి ట్రెండీ టై-డై, మార్బుల్‌, హోలోగ్రాఫిక్‌ ప్రింట్స్‌లో ఉంటాయి. చెమట దుర్వాసన రాని, తేమ నిర్వహించేటటువంటి అవకాశాలు సైతం లభ్యమవుతాయి. ఈ సీజన్‌కు ఇవి ఖచ్చితమైన ఎంపికగా జాగర్స్‌కు లభ్యమవుతాయి. ఇవి 599 రూపాయల ధరలో లభిస్తాయి. మగవారు ఇప్పుడు తమ తీవ్రమైన వర్కవుట్‌ లుక్స్‌ను నూతన కప్పా శ్రేణి పెర్‌ఫార్మెన్స్‌ క్లాతింగ్‌తో ఆకర్షణీయంగా మార్చవచ్చు. ఇవి 499 రూపాయల ప్రారంభ ధరతో లభ్యమవుతాయి.

 
ఈ సందర్భంగా శ్రీ దేవరంజన్‌ అయ్యర్‌- సీఈవో, లైఫ్‌స్టైల్‌ మాట్లాడుతూ, ‘‘మా నూతన స్ర్పింగ్‌/సమ్మర్‌ కలెక్షన్‌ పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఇది హై స్టైల్‌ సమ్మర్‌ ఫ్యాషన్‌కు సంబంధించి ప్రత్యేకంగా ఎంపిక చేసిన కలెక్షన్‌. ఆహ్లాదకరమైన ధరలలో ఇది లభ్యమవుతుంది. ఈ స్ర్పింగ్‌/సమ్మర్‌ సీజన్‌ను ఆహ్లాదకరమైన రంగులు, ఆనందం, సానుకూలతతో ముడిపడి ఉంది మరియు తాజా ధోరణులలో ఈ వైబ్స్‌ను ప్రతిబింబించేలా మా కలెక్షన్‌ను లక్ష్యంగా పెట్టుకున్నాం. మా స్టోర్లు, ఆన్‌లైన్‌లో మా కలెక్షన్‌ను అన్వేషించాల్సిందిగా మా వినియోగదారులను ఆహ్వానిస్తున్నాము. ఈ నూతన సీజన్‌ను సరికొత్త శైలిలో ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాము’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అన్నంలో రసం పోసుకుని తింటుంటాం కదా, అందులో వుండే ప్రయోజనాలు ఏమిటంటే...