దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. గత కొన్ని రోజులుగా పసిడి ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. అదేసమయంలో డిమాండ్ కూడా పెరిగిపోయింది. అయినప్పటికీ బంగారం ధరల్లో ఎలాంటి మార్పులు కనిపించలేదు.
మంగళవారం బులియన్ మార్కెట్ రేట్ల ప్రకారం 22 క్యారెట్ల బంగారం ధర రూ.46250గా ఉంది. అలాగే, 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాముల ధర రూ.50450గా వుంది. అలాగే, వెండి ధరల్లో కూడా మార్పులు లేవు.
దేశ రాజధానిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46250గా ఉంటే, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50450గా ఉంది. ఇక హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46250గా ఉంటే 24 క్యారెట్ల బంగారం ధర రూ.50450గా వుంది. విజయవాడ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46250గా ఉంటే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50450గావుంది.