Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లాక్ డౌన్ నిబంధనలు సడలింపు: తగ్గిన బంగారం ధరలు

లాక్ డౌన్ నిబంధనలు సడలింపు: తగ్గిన బంగారం ధరలు
, సోమవారం, 1 జూన్ 2020 (19:52 IST)
అనేక దేశాలలో కరోనా వైరస్ కొత్త కేసులను నమోదు చేయడంతో ప్రపంచ దేశాల ప్రభుత్వాలు కరోనావైరస్ యొక్క రెండవ విడతపై ఆందోళన చెందుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ పునఃప్రారంభం, పౌరుల భద్రతను ఎలా కాపాడుకోవాలి అనేదే ప్రధాన సమస్యగా మారినది. ఈ నేపధ్యంలో మార్కెట్ పరిస్థితి ఎలా వుందో చూద్దాం.
 
బంగారం
గత వారం, స్పాట్ బంగారం ధరలు 0.4 శాతం తగ్గాయి, అనేక దేశాలు లాక్ డౌన్‌లను తొలగించాయి. ఇది ఆర్థిక పునరుద్ధరణ జరుగుతుందనే ఆశలు రేకెత్తించింది. ఇది పెట్టుబడిదారులు రిస్క్ అసెట్లకు పాల్పడటానికి దారితీసింది. పసుపు లోహం ధరను తగ్గించింది.
 
హాంకాంగ్‌లో కఠినమైన, ప్రాచీన భద్రతా నిబంధనలను అమలు చేయాలని చైనా ప్రతిపాదించడంతో యుఎస్, చైనా మధ్య తాజా ఉద్రిక్తతలు చెలరేగాయి. అధ్యక్షుడు ట్రంప్ చైనాపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. దీనితో హాంకాంగ్‌లో విస్తృత నిరసనలు చెలరేగాయి. ఈ కారణాల వలన బంగారం ధర తగ్గింది.
 
వెండి
గత వారం, స్పాట్ వెండి ధరలు 3.84 శాతం పెరిగి ఔన్సుకు 17.8 డాలర్లకు చేరుకున్నాయి. ఎంసిఎక్స్ ధరలు 3.68 శాతం పెరిగి కిలోకు రూ. 50118 వద్ద ముగిశాయి.
 
ముడి చమురు
గత వారం, డబ్ల్యుటిఐ ముడిచమురు ధరలు 6.7 శాతం అధికంగా ముగిశాయి. ఎందుకంటే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాతో మొదటి దశ వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయలేదు. జూన్, జూలై నెలల్లో దూకుడు ఉత్పత్తి కోతలను కొనసాగించాలా వద్దా అని నిర్ణయించడానికి ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ నేషన్స్(ఒపెక్) సభ్యుల నడుమ ఒక సమావేశం జరుగనుంది. అయినప్పటికీ, ఉత్పత్తి కోతలపై రష్యా అంగీకరించకపోవడం భవిష్యత్ నిర్ణయాలపై అధిక భారాన్ని కొనసాగింపజేస్తుంది.
 
అమెరికా ముడిచమురు ఇన్వెంటరీ స్థాయిలు మే 22 నాటి వరకు, వారంలో 7.9 మిలియన్ బారెల్స్ పెరిగాయి. వాయు మరియు రహదారి ట్రాఫిక్‌పై ఆంక్షలతో పాటు ముడిచమురు స్థాయిలలో ఈ ఆకస్మిక పెరుగుదల బలహీనమైన ప్రపంచ డిమాండ్‌ను సూచించింది మరియు ముడి చమురు ధరల పెరుగుదలను పరిమితం చేసింది.
 
మూల లోహాలు
గత వారం, లండన్ మెటల్ ఎక్స్ఛేంజ్(ఎల్ఎమ్ఇ)లోని మూల లోహ ధరలను అల్యూమినియంతో మిళితం చేసి, ప్యాక్‌లో అత్యధిక లాభాలను ఆర్జించింది. చైనా ఆవిష్కరించిన ప్రాక్టికల్ మరియు ఫార్వర్డ్ లుకింగ్ ఉద్దీపన ప్యాకేజీలు, ధరల పెరుగుదలకు మరింత దోహదపడ్డాయి. అయినప్పటికీ, మహమ్మారికి కారణం చైనానే అని అమెరికా దానివైపు వేళ్లు చూపించడం కొనసాగించింది. ఇది మరింత జఠిలం కావడానికి దారితీస్తుంది. గట్టి వాణిజ్య యుద్ధానికి దారితీస్తుంది, ఇది మరింత పెరుగుదలను తగ్గిస్తుంది.
 
రాగి
గత వారం, చైనా నుండి డిమాండ్ పెరుగుతుందనే ఆశతో ఎల్‌ఎంఇ రాగి 1.6 శాతం పెరిగింది. పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా (పిబిఒసి) ఆర్థిక ప్యాకేజీలను ఆవిష్కరించింది, ఇందులో ఉన్న గణనీయమైన మౌలిక సదుపాయాల వ్యయం, డిమాండ్ పెరుగుతుందనే ఆశలను పెంచింది.
 
ప్రపంచంలోని వివిధ దేశాలలో పెరుగుతున్న నిరుద్యోగం మరియు పేదరికంతో ప్రభుత్వాలు ఎలా వ్యవహరించగలవో చూడాలి. వ్యాక్సిన్ అభివృద్ధి చెందుతుందనే ఆశలు కొనసాగుతున్నాయి, అయితే ప్రాధమిక దృష్టి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ప్రభావితమైన ప్రజలకు ఉపశమనం కలిగించడంపైనే ఉండాలి.
 
- ప్రథమేష్ మాల్యా, ఛీఫ్ అనలిస్ట్, నాన్ అగ్రి కమాడిటీస్ అండ్ కరెన్సీస్, ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్మార్ట్ ఫోన్ ధరలను పెంచేసిన రెడ్ మీ.. ధరలెంతో తెలుసా?