Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రోత్సాహకాలతో ఎథర్‌ ఎలక్ట్రిక్‌ డిసెంబర్‌‌ను పరిచయం చేసిన ఎథర్‌ ఎనర్జీ

Advertiesment
Ather
, శనివారం, 3 డిశెంబరు 2022 (23:18 IST)
భారతదేశంలో సుప్రసిద్ధ విద్యుత్‌ స్కూటర్‌ తయారీదారు ఎథర్‌ ఎనర్జీ నేడు తమ తాజా కార్యక్రమం- ఎథర్‌ ఎలక్ట్రిక్‌ డిసెంబర్‌ను ప్రకటించింది. నెల రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా పలు ఆకర్షణీయమైన ప్రయోజనాలు, ఋణ అవకాశాలు మరియు మార్పిడి పథకాలను తమ వినియోగదారులకు మొట్టమొదటి సారిగా అందిస్తుంది. ఈ కార్యక్రమాన్ని సౌకర్యవంతమైన, ఇబ్బందులు లేని రీతిలో ఉచిత మార్పిడి అనుభవాలను ఈవీ ప్రియులకు విలువ ఆధారిత సేవలతో అందిస్తున్నారు. దీని ద్వారా దేశంలో ఈవీల స్వీకరణ మరింత వేగవంతం కానుంది.
 
ఈ ప్రచారం గురించి ఎథర్‌ ఎనర్జీ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ రవ్‌నీత్‌ ఎస్‌ ఫోఖేలా మాట్లాడుతూ, ‘‘ఎథర్‌ వద్ద ఇది మాకు అత్యంత అద్భుతమైన సంవత్సరంగా నిలిచింది.  మా వేగవంతమైన రిటైల్‌ విస్తరణతో ప్రధాన స్రవంతి వాహన తయారీదారునిగా బలమైన అడుగులు వేస్తున్నాము. ఈ ధోరణి 2023లో కొనసాగుతుందని ఆశిస్తున్నాము. ఈ అద్భుతమైన సంవత్సరంను వేడుక చేసేందుకు మేము పలు ప్రోత్సాహకాలను పరిచయం చేశాము. తద్వారా ఎథర్‌ స్కూటర్‌ కొనుగోలు చేయడానికి అద్భుతమైన సమయంగా ఇది నిలుస్తుంది’’ అని అన్నారు
 
ఉత్పత్తి కోణంలో చూస్తే, ఎథర్‌ ఇప్పుడు 6,999 రూపాయల విలువ కలిగిన ఎక్స్‌టెండెడ్‌ బ్యాటరీ వారెంటీని కేవలం ఒక్క రూపాయికి అందిస్తుంది. ఈ కార్యక్రమంతో, వినియోగదారులు తమ స్కూటర్‌ బ్యాటరీలను అదనంగా రెండు సంవత్సరాలు (తయారీదారులు అందిస్తున్న మూడు సంవత్సరాల వారెంటీకి అదనం) అందిస్తుంది. తద్వారా బ్యాటరీ వారెంటీ కాలం ఐదు సంవత్సరాలకు పెరుగుతుంది. ఇది ప్రత్యేక పరిచయ మరియు పరిమిత కాలపు ఆఫర్‌. ఇది కేవలం ఎథర్‌ 450X, ఎథర్‌ 450 ప్లస్‌ స్కూటర్లను డిసెంబర్‌ 2022లో కొనుగోలు చేసిన వాహనదారులకు మాత్రమే లభిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేను పరాజయం పొందిన పొలిటీషియన్‌ను: జనసేన అధినేత పవన్