Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
बुधवार, 25 दिसंबर 2024
webdunia
Advertiesment

హైదరాబాద్‌లో తమ మొట్టమొదటి కేంద్రాన్ని ప్రారంభించిన అట్లాస్‌ చిరోప్రాక్టిక్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్‌

image
, శుక్రవారం, 2 డిశెంబరు 2022 (16:54 IST)
భారతదేశంలో సుప్రసిద్ధ చిరోప్రాక్టిక్‌ ఆరోగ్య సంరక్షణ సేవల ప్రదాత అట్లాస్‌ చికోప్రాక్టిక్‌ అండ్‌ వెల్‌నెస్‌ హైదరాబాద్‌లో తమ మొదటి, భారతదేశంలో ఐదవ కేంద్రాన్ని నేడు ప్రారంభించింది. ఇప్పటికే సంస్ధ బెంగళూరు, చెన్నైలలో తమ కేంద్రాలను నిర్వహిస్తుంది. తమ సేవలకు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా మరికొన్ని కేంద్రాలను సంస్ధ ఇతర ప్రాంతాలలో సైతం ప్రారంభించనుంది. పలు రకాల సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు అందుబాటు ధరలలో మెరుగైన సేవలనందించాలనే కంపెనీ యొక్క నిరంతర ప్రయత్నాలకు నిదర్శనంగా హైదరాబాద్‌లోని అట్లాస్‌ చిరోప్రాక్టిక్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్‌ నిలుస్తుంది.
 
చిరోప్రాక్టిక్‌ హెడ్‌, అట్లాస్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ప్రతాప్‌ అడ్డగీతల మాట్లాడుతూ ‘‘ఇది నాకు చాలా ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే ఓ దశాబ్దం క్రితం సరిగ్గా ఇదే రోజు చిరోప్రాక్టిక్‌ డాక్టర్‌గా కెరీర్‌ ప్రారంభించాను. న్యూయార్క్‌ చిరోప్రాక్టిక్‌ కాలేజీ (నార్త్‌ఈస్ట్‌ కాలేజీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌గా సుప్రసిద్ధి)లో మాస్టర్స్‌ చేసి ప్రజల జీవితాలలో మార్పు తీసుకురాగలననే నమ్మకంతో ఈ వృత్తిలోకి వచ్చాను’’ అని అన్నారు.
 
ఆయనే మాట్లాడుతూ ‘‘ఓ మనిషికి చేపను దానంగా ఇవ్వడం కంటే, ఆ చేపను ఎలా పట్టాలో తెలపడం మంచిదనే సూత్రాన్ని అనుసరిస్తాను. తమ రికవరీ ప్రక్రియలో రోగి పాత్ర ఎక్కువగా ఉందని నమ్ముతున్నాను. తమ ఆరోగ్యం పట్ల తామే జాగ్రత్త తీసుకునేలా రోగికి తెలుపుతాము. చిరోప్రాక్టిక్‌‌తో ఇది సాధ్యం! ఐదు సంవత్సరాల క్రితం అట్లాస్‌ ప్రారంభమైంది. ఇప్పుడు ఆరుగురు లైసెన్సెడ్‌, సర్టిఫైడ్‌ డాక్టర్లు, నాలుగు దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తూ మా దగ్గర ఉన్నారు’’ అని అన్నారు. డాక్టర్‌ అడ్డగీతల, బెంగళూరు కేంద్ర కార్యకలాపాలు చూస్తే, హైదరాబాద్‌ ఆఫీసులో హెడ్‌ క్లీనిషియన్‌గా ఫ్రాన్స్‌కు చెందిన డాక్టర్‌ యాస్మిన్‌ ఐస్సా వ్యవహరించనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజయవాడ కేంద్రంగా సెక్స్ స్కామ్ : టీడీపీ నేత బొండా ఉమ