Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మందార పువ్వులు.. పెరుగు, హెయిర్ ప్యాక్ వేసుకుంటే..?

Advertiesment
hibiscus mask
hibiscus mask
మందార పువ్వులతో హెయిర్ ప్యాక్ వేసుకోవడం ద్వారా జుట్టు వత్తుగా పెరుగుతుందని.. జుట్టు రాలే సమస్యలుండవని బ్యూటీషియన్లు అంటున్నారు. మందార పువ్వులు, మందార ఆకులు జుట్టుకు మంచి కండిషనర్‌గా పనిచేస్తాయి. జుట్టును చుండ్రు నుంచి కాపాడుతాయి. మందార పువ్వుల్లో విటమిన్ ఎ, సి, అమినో యాసిడ్లు పుష్కలంగా వున్నాయి.  మందార ఆకులు.. జుట్టుకు సౌందర్యాన్నిస్తుంది. జుట్టు పెరుగుదలకు ఉపకరిస్తుంది. 
 
ఈ హెర్బల్‌ను వారానికి రెండుసార్లు ఉపయోగిస్తే.. జుట్టు దట్టంగా తయారవుతాయి. మందార పువ్వులు లేదా ఆకులకు పెరుగు లేదా మెంతులుతో కలిపి పేస్టుగా చేసుకుని జుట్టుకు పట్టించాలి. రోజ్ మేరీ ఆయిల్, పెరుగు నాలుగు టీ స్పూన్లు, మందార పువ్వులు తీసుకుని పేస్టులా చేసుకుని జుట్టుకు ప్యాక్‌లా వేసుకోవచ్చు. మాడుకు బాగా పట్టించి అరగంట తర్వాత కడిగేస్తే జుట్టు మెరిసిపోతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టమాటా పైపొర జీర్ణం కాదంటారు, ఎందువల్ల?