Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Weekly Horoscope: 30-11-2025 నుంచి 06-12-2025 వరకు మీ వార ఫలితాలు

Advertiesment
Weekly Horoscope
Weekly Horoscope
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కృషి ఫలించకున్నా యత్నించామన్న తృప్తి ఉంటుంది. నిరుత్సాహం వీడి శ్రమించండి. అపజయాలకు కుంగిపోవద్దు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఆశావహదృక్పధంతో మెలగండి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. ధనసహాయం తగదు. మీ ఇబ్బందులను సున్నితంగా తెలియజేయండి. గురువారం నాడు పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. కొందరి నిర్లక్ష్యం మీకు ఇబ్బందిగా మారుతుంది. అందరితోను మితంగా సంభాషించండి. కొంతమంది మీ వ్యాఖ్యలను తప్పుపడతారు. సంతానం కదలికలపై దృష్టి సారించండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. కిట్టని వారు తప్పుదారి పట్టించేందుకు ఆస్కారం ఉంది. వ్యాపారాలు గణనీయంగా ఊపందుకుంటాయి. వేడుకలు, వినోదాల్లో అత్యుత్సాహం తగదు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. లక్ష్యసాధకు మరింత శ్రమించాలి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. దుబారా ఖర్చులు విపరీతం. సోమవారం నాడు పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. కొందరి రాక వల్ల కార్యక్రమాలకు అంతరాయం కలుగుతుంది. దంపతుల మధ్య సఖ్యత లోపం. చీటికి మాటికి అసహనం చెందుతారు. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. మీ తప్పిదాలను సరిదిద్దుకోవటం ముఖ్యం. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. విలువైన వస్తువులు, నగదు జాగ్రత్త. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. వృత్తుల వారికి అవకాశాలు కలిసివస్తాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ముఖ్యం. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
అన్నిరంగాల వారికీ యోగదాయకమే. లక్ష్యం నెరవేరుతుంది. అనుకున్నది సాధిస్తారు. మొండి బాకీలు వసూలవుతాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. పనులు వేగవంతమవుతాయి. శుక్రవారం నాడు పరిచయం లేని వారితో జాగ్రత్త. మీ నుంచి విషయసేకరణకు కొంతమంది యత్నిస్తారు. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. సంతానానికి శుభయోగం. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. మీ జోక్యంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. దూరపు బంధువుల ఆహ్వానం అందుకుంటారు. వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. అనుకున్న లక్ష్యం సాధిస్తారు. గృహంలో శుభకార్యం నిశ్చయమవుతుంది. కల్యాణ వేదికలు అన్వేషిస్తారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. శనివారం నాడు పెద్దమొత్తం నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. అపరిచితులను ఓ కంట కనిపెట్టండి. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. ఆత్మీయులతో తరచు సంభాషిస్తుంటారు. పత్రాల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు ఉల్లాసం కలిగిస్తాయి. ఆరోగ్యం మందగిస్తుంది. అతిగా శ్రమించవద్దు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతి. రిటైర్డు అధికారులకు వీడ్కోలు పలుకుతతారు.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కార్యసాధననలో సఫలీకృతులవుతారు. ఇంటా బయటా ప్రశాంతత నెలకొంటుంది. ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. బుధవారం నాడు ఒకేసారి పలు పనులతో సతమతమవుతారు. శ్రమ అధికం, అకాలభోజనం. బంధువులు ఆకస్మిక రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. అవతలి వారి తాహతును స్వయంగా తెలుసుకోండి. మధ్యవర్తులను విశ్వసించవద్దు. సంతానానికి శుభపరిణామాలున్నాయి. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. గృహోపకరణాలు మరమ్మతుకు గురవుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. ఏకాగ్రతతో వాహనం నడపండి. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఈ వారం కొంతమేరకు ఆశాజనకం. శారీక శ్రమ అధికమైనా ఆశించిన ఫలితం ఉంటుంది. ఆదాయానికి తగ్గట్టుగానే ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం లేదు. పరిచయస్తులు మీ సహాయం కోరుతారు. ధనసహాయం విషయం పునరాలోచించండి. మీ శ్రీమతి వద్ద దాపరికం తగదు. మొదలెట్టిన పనులు మధ్యలో ఆపవద్దు. ఇంటి విషయాలపై దృష్టి పెట్టండి. ఒక సంఘటన మీపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అయిన వారిని సంప్రదిస్తారు. ఎదుటివారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోండి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. పరిచయాలు బలపడతాయి. ఉద్యోగ విధులను సమర్ధంగా నిర్వహిస్తారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. యోగ, ధార్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది. ధనం మితంగా వ్యయం చేయండి. పెట్టుబడులు కలిసిరావు. పనులు ప్రారంభించే సరికి ఆటంకాలెదురవుతాయి. మీపై శకునాల ప్రభావం అధికం. మీ శ్రీమతి ప్రోద్బలంతో ముందుకు సాగుతారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. అయిన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. మొహమ్మాటాలు, భేషజాలకు పోవద్దు. వివాహయత్నం తీవ్రంగా సాగిస్తారు. ఆశించిన సంబంధం కలిసిరాదు. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. నిరుద్యోగులకు సదవకాశం లభిస్తుంది. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ప్రతికూలతలు అధికం. ఆచితూచి అడుగేయండి. ఏ పని తలపెట్టినా మళ్లీ మొదటికే వస్తుంది. చీటికిమాటికి అసహనం చెందుతారు. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. చేతిలో ధనం నిలవదు. ముఖ్యుల కలయిక వీలుపడదు. మంగళవారం నాడు చెల్లింపుల్లో జాగ్రత్త వహించండి. అపరిచితులు మోసగించేందుకు యత్నిస్తారు. ఈ చికాకులు తాత్కాలికమే. నిబ్బరంగా మెలగండి. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. కొందరి వ్యాఖ్యులు నిరుత్సాహపరుస్తాయి. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. సంతానానికి శుభపరిణామాలున్నాయి. వ్యాపారాల్లో నష్టాలు చవిచూడవలసి వస్తుంది. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. ఉద్యోగ బాధ్యతల పట్ల ఏకాగ్రత వహించండి. ప్రలోభాలకు లొంగవద్దు. సన్నిహితులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. వనసమారాధనలో పాల్గొంటారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
కార్యానుకూలత ఉంది. లక్ష్యాన్ని సాధిస్తారు. ఆశలొదిలేసుకున్న ధనం అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ఆదివారం నాడు ఏ పనీ ముందుకు సాగదు. ఆత్మీయులతో తరచుగా సంభాషిస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. మానసిక ప్రశాంతత పొందుతారు. పత్రాల్లో సవరణలు అనుకూలించవు. పట్టుదలతో మరోసారి యత్నించండి. చిన్ననాటి పరిచయస్తుల నుంచి ఆహ్వానం అందుకుంటారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ప్రాజెక్టులు, పెట్టుబడులకు అనుకూలం. ఉపాధ్యాయులకు కొత్త బాధ్యతలు. ఉల్లాసంగా గడుపుతారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. వేడుకల్లో అత్యుత్సాహ తగదు. ఏకాగ్రతతో వాహనం నడపండి. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆదాయం బాగుంటుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. పనులు సానుకూలమవుతాయి. స్నేహసంబంధాలు బలపడతాయి. వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. శనివారం నాడు మీ వ్యక్తిత్వానికి భంగం కలిగే సూచనలున్నాయి. అనవసర విషయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. గృహ మరమ్మతులు చేపడతారు. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెట్టండి. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. ప్రియతములతో సంభాషణ ఉత్తేజం కలిగిస్తుంది. ఉద్యోగ, ఉపాధ్యాయుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. నిరుద్యోగులు రాత, మౌఖిక పరీక్షల్లో విజయం సాధిస్తారు. నూతన వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
అన్నివిధాలా యోగదాయకమే. మీ కృషి ఫలిస్తుంది. లక్ష్యానికి చేరవవుతారు. ఉల్లాసంగా గడుపుతారు. రావలసిన ధనం అందుతుంది. పొదుపు పథకాలపై దృష్టిపెడతారు. బంధువులు మీ సాయం కోరుతారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. సోమవారం నాడు చేపట్టిన పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ముఖ్యులను కలిసినా ఆశించిన ఫలితం ఉండదు. మొండిగా ముందుకు సాగుతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. మీ శ్రీవారు లేక శ్రీమతి ధోరణలో మార్పు వస్తుంది. మానసికంగా కుదుటపడతారు. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. వ్యాపారాలు గణనీయంగా పుంజుకుంటాయి. ఆటుపోట్లకు దీటుగా స్పందిస్తారు. ఉద్యోగస్తులకు బదిలీతో కూడిన పదోన్నతి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. కంప్యూటర్, ప్రింటింగ్ రంగాల వారికి పనిభారం. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
వ్యూహాత్మకంగా అడుగులు ముందుకువేస్తారు. మీ ఊహలు, అంచనాలు ఫలిస్తాయి. ప్రముఖులకు సన్నిహితులవుతారు. ఆశించిన పదవి మాత్రం దక్కదు. బాధ్యతా మెలగండి. చిన్న చిన్న విషయాలకుర ప్రాధాన్యమివ్వవద్దు. ఆదాయం బాగుంటుంది. విలాసాలక విపరీతంగా ఖర్చు చేస్తారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. మీ ఇబ్బందులను సున్నితంగా వ్యక్తం చేయండి. ఎవరినీ నొప్పించవద్దు. బుధవారం నాడు పరిచయస్తుల రాక ఇబ్బంది కలుగుతుంది. పనులు ఒక పట్టాన పూర్తికావు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. మానసికంగా కుదుటపడతారు. వివాహయత్నం ఫలిస్తుంది. తాహతుకు మించిన హామీలివ్వవద్దు. పెట్టుబడులకు అనుకూలం. సొంత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వినోదాలు, వనసమారాధనలో పాల్గొంటారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శబరిమల ఆలయం నుండి బంగారం మాయం.. మాజీ తిరువాభరణం కమిషనర్‌ వద్ద విచారణ