November 2025 Monthly Horoscope
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ప్రథమార్థం అనుకూలం, కార్యం సానుకూలమవుతుంది. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ఆదాయానికి తగ్గట్లుగా ఖర్చులుంటాయి. పెట్టుబడుల విషయం పునరాలోచించండి. వాయిదా పడుతూ వస్తున్న పసులు ఎట్టకేలకు పూర్తవుతాయి. వివాహయత్నం తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే అవకాశం ఉంది. మీ శ్రీమతి అభిప్రాయం తెలుసుకోండి. ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవద్దు. ద్వితీయార్థం అసమత్తంగా ఉండాల్సిన సమయం. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ప్రముఖాలను కలిగినా ఫలితం ఉండదు. ఆశావహదృక్పథంతో యత్నాలు సాగించండి. సన్నిహితుల వ్యాఖ్యలు ఉపశమనం కలిగిస్తాయి. సంతానానికి శుభం జరుగుతుంది. దూరపు బంధువులు ఆహ్వానం అందుకుంటారు. పత్రాల రెన్యువల్ సవరణ సాధ్యం కాదు. వనసమారాధనలో పాల్గొంటారు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
అన్నింటా మీదే పైచేయి. కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. సర్వత్రా ప్రశాంతత నెలకొంటుంది. సమర్థతను చాటుకుంటారు. గౌరవప్రతిష్టలు పెంపొందుతాయి. వ్యవహారానుకూలత ఉంది. కొన్ని సమస్యలు అనుకోకుండా సద్దుమణుగుతాయి. దుబారా ఖర్చులు అధికం, విలాసాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. ధనసహాయం తగదు. ఒకరికి సాయం చేసి ఇబ్బందులెదుర్కుంటారు. ఆరోగ్యం జాగ్రత్త. ఔషధసేవనం, ఆహార నియమాలు క్రమం తప్పకుండా పాటించండి. సంతానం అత్యుత్సాహం చికాకు పరుస్తుంది. సామరస్యంగా మెలగండి. కీలక పత్రాలు అందుకుంటారు. దూరపు బంధుత్వాలు బలపడుతాయి. సంస్థలు స్థాపనలకు తరుణం కాదు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. శుభకార్యానికి హాజరవుతారు. ఇంటిని నిర్లక్ష్యంగా వదలి వెళ్లకండి.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఈ మాసం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. లావాదేవీలు ముందుకు సాగవు. రావలసిన ధనాన్ని లౌక్యంగా రాబట్టుకోవాలి. ఖర్చులు అదుపులో ఉండవు. రుణాలు, చేబదుళ్లు తప్పకపోవచ్చు. ఆపత్సమయంలో సన్నిపాతులు ఆదుకుంటారు. పనులు చురుకుగా సాగుతాయి. మీ చౌరనతో శుభకార్యం నిశ్చయమవుతుంది. ఆత్మీయులతో తరుచుగా కాలక్షేపం చేస్తుంటారు. వార గృహంలో సంతోషం కలిగిస్తుంది. లైసెన్సులు, పర్మిట్ల విషయంలో జాప్యం తగదు. పోగొట్టుదున్న వస్తువులు లభ్యమవుతాయి. శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. దళారులు, కన్సల్టెన్సీలను నమ్మవద్దు. మీ నుంచి లబ్ది పొందేందుకు కొందరు యత్నిస్తారు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. ఫెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణం తగదు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆదాయం బాగుంటుంది. వాహనం, విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధుత్వాలు బలపడతాయి. గృహం సందడిగా ఉంటుంది. వాయిదా పడుతూ వస్తున్న పనులు ఆకస్మికంగా పూర్తపుతాయి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. సంతాన సౌఖ్యం ప్రశాంతత పొందుతారు. లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి. తొందరపాటు నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. అనుభవజ్ఞులను సంప్రదించండి. పట్టింపులకు పోవద్దు, కలిసివచ్చిన అవకాశాన్ని తక్షణం అందిపుచ్చుకోండి. మీ సాయంతో ఒకరికి బట్టి చేకూరుతుంది. ప్రముఖులతో పరిచయాలు మరింత బలపడతాయి. ప్రత్యర్థులు విషయంలో జాగ్రత్త ఎవరినీ అతిగా నన్నువద్దు. గృహనిర్మాణం పూర్తికావస్తుంది. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవదీక్షలు స్వీకరిస్తారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు భారమనిపించవు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. అంతంగా ముగించిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. ఆత్మీయులతో తరచుగా సంభాషిస్తుంటారు. సంతానం కదలికలపై కన్నేసి ఉంచండి. అవ్వానం అందుకుంటారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. అనాలోచిత నిర్ణయం తగదు. మీ శ్రీమతి సలహా పాటించండి. పోలీసులు అందుకుంటారు. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపచేస్తుంది. న్యాయ నిపణులను సంప్రదిస్తారు. సోదరుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. మీ అభిప్రాయాలకు అభ్యంతరాలు ఎదురవవుతాయి. పంతాలు, పట్టుదలకు పోవద్దు. సామరస్యంగా సమస్యలనుపరిష్కరించుకోండి. శుభకార్యానికి హాజరు కాలేరు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
మీ ఓర్పునకు పరీక్షా సమయం. చిన్న విషయానికే ఆగ్రహం చెందుతారు. అందరితోను కలుపుగోలుగా మెలగండి. వ్యాఖ్యలు, విమర్శలు వట్టించుకోవద్దు. మీ సహనమే మీకు శ్రీరామరక్ష ఖర్చులు అదుపులో ఉండవు. ధనసమస్యలెదురవుతాయి. రుణబత్తిళ్లు ఎదుర్కుంటారు. మంచేందుకు మనస్కరించదు. అవసరాలు వాయిదా వేసించారు. చెల్లింపులు వాయిదా వేయకండి చేపట్టిన ససలు మొక్కబడిగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. ఉత్సాహంగా శ్రమిస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. సంతానానికి శుభపరిణామాలున్నాయి. పత్రాల్లో మార్పుచేర్పులు సాధ్యం కావు. ఆశావహదృక్పధంతో మరోసారి ప్రయత్నించండి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. యోగ పట్ల ఆసక్తి కనబరుస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. వాహనం నడిపేటప్పుడు ఏకాగ్రత ప్రధానం.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ప్రతికూలతలు అధనం, సంప్రదింపులు ముందుకు సాగవు. కొత్త సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. ప్రతి విషయంలోను బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కొత్తగా చేపట్టిన పనుల్లో అవాంతరాలెదురవుతాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ధనం మితంగా ఖర్చు చేయండి. చెల్లింపుల్లో జాప్యం తగదు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ముఖ్యమైన సూత్రాలు అందుకుంటారు. సంతానం కృషి ఫలిస్తుంది. అవివాహితులకు శుభయోగం గృహమార్పు అనివార్యం, సగరు. విలువైన వస్తువులు. జాగ్రత్త మీ విషయాల్లో అతరుల చోగ్యానికి తావివ్వవద్దు. ఆహ్వానం అందుకుంటారు. పాతమిత్రులు కలయిక అనుభూతినిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం, ఆత్మీయులతో సంభాషిస్తుంటారు. ఆధ్యాత్మకత పెంపొందుతుంది. తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1, 2, 3, 4 పాదములు
ఈ మాసం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనలాభం, వస్త్రసాప్తి పొందుతారు. కొంతమొత్తం ధనం అందుతుంది. పొడుపు సథకాలపై దృష్టి పెడతారు. కొత్త పనులు చేపడతారు. మీ సాయంతో ఒకరికి లబ్ధి చేకూరుతుంది. స్నేహసంబంధాలు బలపడతాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సన్నిహిరుడు.. మీ సమస్య తెలియజేయండి. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. వాహనం, గృహోపకరణాలు మరమ్మతుకు గురవుతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం. కలిసివచ్చే అవకాశం ఉంది. మీ ఇష్టాయిష్టాలను స్పష్టంగా తెలియజేయండి. వేడుకకు హాజరవుతారు. కొత్త పరిచయాలేర్పడతాయి.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ప్రథమార్థం అనుకూలదాయకం. లక్ష్యాన్ని సాధిస్తారు. ధనులు వేగవంతమవుతాయి, ఆదాయానికి తగ్గట్టుగా బడ్జెట్ రూపొందించుకుంటారు. ఖర్చులు అధికం, సంతృప్తికరం. ప్రముఖులకు సన్నిహితులవుతారు. ఆశించిన పదవి దక్కకపోవచ్చు. ఏది జరిగినా ఒకందుకు మంచికే దూరపు బంధుత్వాలు బలవడతాయి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. ద్వితీయార్ధం సామాన్యం, ప్రియతముల ఆరోగ్యం ఆందోళన కలిగింది. ఆకస్మిక ప్రయాణం చేయవలసి వస్తుంది. సన్నిహితులతో తరచుగా సంభాషిస్తారు. ఒక సమాచారం ఉత్సాహం కలిగిస్తుంది. నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. కలిసివచ్చిన అవకాశాలను అందివుచ్చుకోండి. అనుమానాలు, అపోహలకు తావివ్వవద్దు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
లావాదేవీలతో సతమతమవుతారు. శ్రమాధిక్యం, విశ్రాంతి లోపం, మితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. పెద్దలను సంప్రదించటం శ్రేయస్కరం, ఆదాయం నిరాశాజనకం, ఖర్చులు అదుపులో ఉండవు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. మీ ప్రమేయంతో ఒక సమస్య సానుకూలమువుతుంది. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. గృహంలో ప్రోత్సాహకర వాతావరణం నెలకొంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఆరోగ్యం జాగ్రత్త అతిగా శ్రమించవద్దు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలకు అభ్యంత రాలెదురవుతాయి. పుణ్యకార్యంలో పాల్గొంటారు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. ప్రలోభాలకు లొంగవద్దు. మనోధైర్యంతో ముందుకు సాగండి. ప్రతి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. నమ్మకస్తులే తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. కార్యసాధనకు మరింత శ్రమించాలి. సాయం ఆర్ధించవద్దు స్వయంకృషితోనే లక్ష్యం సాధిస్తారు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. అవసరాలు, చెల్లింపులు వాయిదా పడతాయి. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. నోటీసులు అందుకుంటారు. ఒక సంఘటన మీపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. సంతానం భవిష్యత్తు గురించి ఆలోచించండి. ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. ఆశావహదృక్పథంతో మెలగండి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దీక్షలు స్వీకరిస్తారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఈ మాసం మిశ్రమ ఫలితాల సమ్మేళనం, లక్ష్యసాధకు ఓర్పు, కృషి ప్రధానం, సాయం ఆశించి భంగపడతారు. మీ సమర్థతపై నమ్మకం పెంచుకోండి. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. రుణవిముక్తులై తాకట్టు విడిపించుకుంటారు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. వివాహయత్నం ఫలించే అవకాశం ఉంది. అవతలి వారి స్థోమతను క్షుణ్ణంగా తెలుసుకోండి. తాహతకు మించి హామీలివ్వవద్దు. మీ ఇష్టాయిష్టాలను పెద్దల ద్వారా తెలియజేయండి. ఒక సంఘటన మీపై ప్రభావం చూపుతుంది. న్యాయ నిపుణులు సంప్రదిస్తారు. స్నేహ సంబంధాలు బలపడతాయి. ముఖ్యమైన వస్తువులు అందుకుంటారు. లైసెన్సులు, ఏకాగ్రత అవసరం. ఇతరులను ఆశ్రయించవద్దు. ప్రియతముల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వనసమారాధనలు, దైవకార్యాల్లో పాల్గొంటారు.