Publish Date: Sun, 28 Dec 2025 (19:08 IST)
Updated Date: Sun, 28 Dec 2025 (19:11 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
మీ ఓర్పునకు పరిక్షా సమయం. ఆటంకాలెదురైనా యత్నాలు కొనసాగించండి. ఏ విషయానికీ నిరుత్సాహపడవద్దు. ఖర్చులు అదుపులో ఉండవు. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. బుధవారం నాడు కావలసిన వ్యక్తుల కలయిక వీలుపడదు. ఆత్మవిశ్వాసంతో మెలగండి. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో అనుకూలతలు నెలకొంటాయి. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. సామరస్యంగా సమస్య పరిష్కరించుకోవాలి. ఆత్మీయులతో సంభాషణ ఊరటనిస్తుంది. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. అయిన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఆరోగ్యం జాగ్రత్త. క్రమం తప్పకుండా ఔషధ సేవనం, ఆహార నియమాలు పాటించండి. వృత్తి వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఈ వారం అనుకూలతలు అంతంత మాత్రమే. మనోధైర్యంతో మెలగండి. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. ధైర్యంగా యత్నాలు సాగించండి. మీ కృషి తక్షణం ఫలిస్తుంది. స్నేహసంబంధాలు బలపడతాయి. దుబారా ఖర్చులు విపరీతం. మీ ఉన్నతిని చాటుకోవటానికి వ్యయం చేస్తారు. పొగిడే వ్యక్తుల ఆంతర్యం గ్రహించండి. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. కలిసివచ్చిన అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. అనుమానాలు, అపోహలకు తావివ్వవద్దు. పాతపరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు ఉల్లాసం కలిగిస్తాయి. సంతానం దూకుడు అదుపు చేయండి. చిన్న విషయమే సమస్యగా మారే ఆస్కారం ఉంది. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. ఆప్తులకు కానుకలిచ్చిపుచ్చుకుంటారు. ఆదాయం బాగుంటుంది. విలాసాలకు వ్యయం చేస్తారు. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ప్రైవేట్ ఫైనాన్సులలో మదుపు తగదు. మీ అభిప్రాయాలను ఖచ్చితంగా తెలియజేయండి. ఎప్పటి నుంచో అనుకుంటున్న పనులు పూర్తిచేస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. కుటుంబసౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. పత్రాల సవరణలో మార్పులు సాధ్యం కావు. మరోసారి యత్నించండి. చిన్న విషయానికే నిరుత్సాహపడవద్దు. నేడు అనుకూలించనిది రేపు ఫలితమిస్తుంది. వ్యాపారాలు జోరుగా సాగుతాయి. మీ పథకాలు ఆశించిన ఫలితం ఇస్తుంది. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. లక్ష్యం సాధిస్తారు. మీ సామర్ధ్యంపై నమ్మకం కలుగుతుంది. ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఆదాయం బాగుంటుంది. ప్రముఖులకు కానుకలు సమర్పించుకుంటారు. మీ మాటతీరు ఆకట్టుకుంటుంది. పరిచయాలు బలపడతాయి. బాధ్యతలు స్వీకరిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. శుక్రవారం నాడు మితంగా సంభాషించండి. వాదోపవాదాలకు దిగవద్దు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఉల్లాసంగా కాలక్షేపం చేస్తారు. గృహంలో మార్పుచేర్పులు అనివార్యం. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. నిపుణులను సంప్రదిస్తారు. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. విందులు, వేడుకకు హాజరవుతారు. మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
సమయస్ఫూర్తితో మెలుగుతారు. అవకాశాలు కలిసివస్తాయి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. స్నేహసంబంధాలు అధికమవుతాయి. బంధుమిత్రుల రాకతో గృహం సందడిగా ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉండవు. మీ ఉన్నతిని చాటుకోవటానికి విపరీతంగా వ్యయం చేస్తారు. పెట్టుబడులకు అనుకూల సమయం. ప్రైవేట్ ఫైనాన్సుల జోలికి పోవద్దు. గురువారం నాడు పనులు హడావుడిగా సాగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశించిన సంబంధం నిరుత్సాహపరుస్తుంది. ఇదీ ఒకందుకు మంచికే. త్వరలో శుభవార్త వింటారు. సంతానం అత్యుత్సాహం అదుపు చేయండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగ విధులను సమర్ధంగా నిర్వహిస్తారు. వాహనదారులకు దూకుడు తగదు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
అన్ని రంగాల వారికీ అనుకూలమే. లక్ష్యాన్ని సాధిస్తారు. పరిచయాలు బలపడతాయి. శుభాకాంక్షలు, కానుకలు అందుకుంటారు. పరిచయస్తుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. ఆదివారం నాడు పనులు మందకొడిగా సాగుతాయి. ప్రముఖుల సందర్శనం కోసం నిరీక్షణ తప్పదు. సంస్థల స్థాపనలకు అనుకూలం. మీ సిఫార్సుతో ఒకరికి సదావకాశం లభిస్తుంది. దంపతుల మధ్య స్వల్ప కలహం. సామరస్యంగా మెలగండి. ఆప్తులతో సంభాషణ ఉత్సాహాన్నిస్తుంది. కొత్తయత్నాలకు శ్రీకారం చుడతారు. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఉద్యోగ ఉపాధ్యాయులకు పనిభారం. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ప్రింటింగ్ రంగాల వారికి నిరాశాజనకం. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, పాశాఖ 1, 2, 3 పాదాలు
పరిస్థితులు కొంతమేరకు అనుకూలిస్తాయి. తలపెట్టిన కార్యం నెరవేరుతుంది. వ్యవహార పరిజ్ఞానంతో రాణిస్తారు. స్థిరాస్తి ధనం అందుతుంది. ఖర్చులు విపరీతం. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. కావలసిన వ్యక్తుల కలయిక వీలుపడదు. సోమవారం నాడు బంధుమిత్రులతో విభేదాలు తలెత్తుతాయి. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. మీ పొరపాట్లు సరిదిద్దుకోవటం ముఖ్యం. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. సామరస్యగా సమస్యలు పరిష్కరించుకోండి. నోటీసులు అందుకుంటారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగ విధుల పట్ల ఏకాగ్రత వహించండి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రం సందర్శిస్తారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. దుబారా ఖర్చులు విపరీతం. ఇతరుల కోసం వ్యయం చేస్తారు. ప్రతి విషయంలోను ఆచితూచి అడుగేయాలి. సాహసకృత్యాలకు పాల్పడవద్దు. పరిచయస్తుల వ్యాఖ్యలకు ధీటుగా స్పందిస్తారు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురైనా మొండిగా పూర్తి చేస్తారు. మంగళవారం నాడు అప్రమత్తంగా ఉండాలి. ఇతరుల బాధ్యతలు చేపట్టి ఇబ్బందులెదుర్కుంటారు. కొన్ని విషయాలు చూసీ చూడనట్టు వదిలేయండి. సంతానం దురుసుతనం వివాదాస్పదమవుతుంది. పెద్దల జోక్యంతో సమస్య సద్దుమణుగుతుంది. ప్రైవేట్ ఉద్యోగస్తులకు కొత్త సమస్య ఎదురవుతుంది. ఆశావహదృక్పథంతో ఉద్యోయత్నం సాగించండి. వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. ఉపాధి పథకాలు సంతృప్తితనిస్తాయి. బెట్టింగ్లకు పాల్పడవద్దు.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
కార్యసాధనకు మరింత శ్రమించాలి. మీ సామర్ధ్యంపై నమ్మకం పెంచుకోండి. సాయం ఆశించవద్దు. పట్టుదలతో కృషి చేస్తే లక్ష్యం నెరవేరుతుంది. ఆదివారం నాడు దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. చేబదుళ్లు, రుణాలు స్వీకరిస్తారు. పనులు ఒక పట్టాన పూర్తికావు. మీపై శకునాల ప్రభావం అధికం. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. సన్నిహితులకు మీ సమస్య తెలియజేయండి. దంపతుల మధ్య దాపరికం తగదు. సంతానం కృషి ఫలిస్తుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. వాస్తుదోష నివారణ చర్యలు అనివార్యం. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ఉద్యోగస్తులకు పనిభారం, అధికారులకు స్థానచలనం.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
సంప్రదింపులతో తీరిక ఉండదు. సముచిత నిర్ణయం తీసుకుంటారు. స్థిరచరాస్తి ధనం అందుతుంది. ఖర్చులు అదుపులో ఉండవు. సావకాశంగా పనులు పూర్తిచేస్తారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. పరస్పరం కానుకలిచ్చుకుంటారు. బుధవారం నాడు ప్రముఖుల సందర్శనం కోసం నిరీక్షిణ తప్పదు. కొత్తయత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాల కోసం ఎదురుచూడవద్దు. మీదైన తరహాలో శ్రమించండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఆప్తులతో సంతోషంగా గడుపుతారు. పత్రాల రెన్యువల్లో జాప్యం తగదు. వృత్తి వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. ఆటుపోట్లకు ధీటుగా స్పందిస్తారు. అధికారుల స్థానచలనం ఉద్యోగస్తులను నిరుత్సాహపరుస్తుంది. ప్రైవేట్ ఉద్యోగస్తులకు మార్పు కలిసివస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
వ్యవహార జయం, కార్యసిద్ధి ఉన్నాయి. మీ పట్టుదల ప్రశంసనీయమవుతుంది. ఉల్లాసంగా గడుపుతారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు తేలికగా పూర్తవుతాయి. ఆదాయం బాగుంటుంది. మీ ఉన్నతిని చాటుకోవటానికి ఖర్చుచేస్తారు. ప్రముఖులను ఆకట్టుకుంటారు. పదవులు, బాధ్యతలు చేపడతారు. ప్రత్యర్థుల తీరును ఓ కంట కనిపెట్టండి. మీ చొరవతో ఒకరికి లబ్ధి చేకూరుతుంది. వివాహయత్నం తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కుదిరే సూచనలున్నాయి. మీ ఇష్టాయిష్టాలను ఆప్తుల ద్వారా తెలియజేయండి. శుక్రవారం నాడు అప్రమత్తంగా ఉండాలి. అందరితోను మితంగా సంభాషించండి. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆశించిన లాభాలు గడిస్తారు. ఉద్యోగస్తులకు కొత్తబాధ్యతలు. క్రీడాపోటీల్లో విజయం సాధిస్తారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. దీర్ఘకాలిక సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకుంటారు. స్ధిరాస్తి ధనం అందుతుంది. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. సంస్థల స్థాపనకు అనుమతులు మంజూరవుతాయి. గురువారం నాడు పనులు, బాధ్యతలు పురమాయించవద్దు. కొందరి నిర్లక్ష్యం మీకు ఇబ్బంది కలిగిస్తుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఆత్మీయులతో తరచు సంభాషిస్తుంటారు. సంతానానికి శుభపరిణామాలున్నాయి. మీ జోక్యం అనివార్యం. ఉభయులకు చక్కని సలహ ఇస్తారు. ఉపాధి పథకాల్లో అనుభవం గడిస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతి. వ్యాపారాల్లో లాభనష్టాలు పరిశీలించుకుంటారు. ప్రయాణంలో ఒకింత అవస్థలు తప్పవు.