Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

29-12-2025 సోమవారం ఫలితాలు - గ్రహబలం అనుకూలంగా లేదు.. భేషజాలకు పోవద్దు...

Advertiesment
daily astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
గ్రహబలం అనుకూలంగా లేదు. భేషజాలకు పోవద్దు. కలిసివచ్చిన అవకాశాన్ని తక్షణం అందిపుచ్చుకోండి. దంపతుల మధ్య దాపరికం తగదు. దుబారా ఖర్చులు విపరీతం. పెద్దల హితవు కార్యోన్ముఖులను చేస్తుంది. మనోధైర్యంతో అడుగు ముందుకేస్తారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
లక్ష్యం నెరవేరుతుంది. వ్యవహారపరిజ్ఞానంతో నెట్టుకొస్తారు. వ్యవహారం మీ ఆధ్వర్యంలో సాగుతుంది. ఖర్చులు అధికం. చెల్లింపుల్లో జాప్యం తగదు. పెద్దమొత్తం నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. కొత్తవ్యక్తులను దరిచేరనీయవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కార్యసిద్ధికి మరింత శ్రమించాలి. నిరుత్సాహానికి గురికావద్దు. పట్టుదలతో ముందుకు సాగండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఖర్చులు విపరీతం. ఆటంకాలు ఎదురైనా సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. దైవకార్యంలో పాల్గొంటారు.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఈ రోజు అనుకూలదాయకం. తలపెట్టిన కార్యం సఫలమవుతుంది. మొండి బాకీల వసూలవుతాయి. ఆప్తులకు సాయం అందిస్తారు. పరిచయాలు బలపడతాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. సాయం ఆశించవద్దు. మీ బలహీతలు అదుపులో ఉంచుకోండి.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. మీ కార్యదీక్ష ప్రశంసనీయమవుతుంది. ఊహించని ఖర్చు ఎదురవుతుంది. ఆప్తులు సాయం అందిస్తారు. అనుకున్న విధంగా పనులు పూర్తి చేయగల్గుతారు. ఆత్మీయులతో తరుచు సంభాషిస్తారు. బాధ్యతలు అప్పగించవద్దు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కార్యసాధనలో సఫలీకృతులవుతారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. పనులు వేగవంతమవుతాయి. అప్రియమైన వార్త వింటారు. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. కీలక పత్రాలు అందుకుంటారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
లావాదేవీలతో తీరిక ఉండదు. సమయస్ఫూర్తిగా మెలగండి. తొందరపాటు నిర్ణయం తగదు. అనుభవజ్ఞులను సంప్రదించండి. ఖర్చులు విపరీతం. అవసరాలు, చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. సన్నిహితులతో సంభాషిస్తారు. బెట్టింగుల జోలికి పోవద్దు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ధైర్యంగా యత్నాలు సాగించండి. విమర్శలు పట్టించుకోవద్దు. ధృఢసంకల్పంతో లక్ష్యం సాధిస్తారు, బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు ముందుకు సాగవు. చీటికిమాటికి చికాకుపడతారు. డ్రా చేసేటపుడు జాగ్రత్త. వేడుకకు హాజరవుతారు. ఇంటిని అలక్ష్యంగా వదిలి వెళ్లకండి. నగదు, ఆభరణాలు జాగ్రత్త.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
మీ గ్రహబలం అనుకూలంగా ఉంది. ఆటంకాలెదురైనా మీ కృషి ఫలిస్తుంది. కొన్ని అవకాశాలు అనుకోకుండా కలిసివస్తాయి. లక్ష్యాన్ని సాధిస్తారు. రావలసిన ధనం అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. సకాలంలో పనులు పూర్తిచేస్తారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
వేడుకను ఘనంగా చేస్తారు. పరస్పరం కానుకలిచ్చిపుచ్చుకుంటారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. అనుకున్న ఖర్చులే ఉంటాయి. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. కొత్త పనులకు ప్రణాళికలు వేసుకుంటారు.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
అన్నివిధాల యోగదాయకమే. స్వయంకృషితో లక్ష్యాన్ని సాధిస్తారు. మీ కార్యదీక్ష ప్రశంసనీయమవుతుంది. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. ధనసహాయం తగదు. మీ అశక్తతను సున్నితంగా వ్యక్తం చేయండి. ఆహ్వానం అందుకుంటారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
మీ ఓర్పునకు పరీక్షా సమయం. సంకల్పబలంతో యత్నాలు సాగించండి. వీలైనంత వరకు ఖర్చులు తగ్గించుకోండి. వాయిదాల చెల్లింపుల్లో జాప్యం తగదు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు, కార్యక్రమాలు సాగవు. ఒక సమాచారం ఉల్లాసం కలిగిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

28-12-2025 నుంచి 03-01-2026 వరకు మీ వార రాశిఫలాలు