మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
గ్రహస్థితి ప్రతికూలంగా ఉంది. ఆచితూచి వ్యవహరించాల్సిన సమయం. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. పెద్దలను సంప్రదించండి. భేషజాలకు పోవద్దు. ఊహించని ఖర్చులతో సతమతమవుతారు. సాయం అర్ధించేందుకు మనస్కరించదు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. చెల్లింపుల్లో అశ్రద్ధ తగదు. శుక్రవారం నాడు దంపతుల మధ్య కలహం. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. ముఖ్యులను కలిసినా ఫలితం ఉండదు. సంతానానికి శుభఫలితాలున్నాయి. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. ఆహ్వానం అందుకుంటారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు అమలు చేస్తారు. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగ విధుల పట్ల ఏకాగ్రత వహించండి. యాదృచ్ఛికంగా పొరపాట్లు దొర్లే ఆస్కారం ఉంది. తీర్ధయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. చిన్న విషయానికే చికాకుపడతారు. పట్టుదలతో యత్నాలు సాగించండి. అవకాశాలను వదులుకోవద్దు. స్థిరాస్తి ధనం అందుతుంది. ఖర్చులు అదుపులో ఉండవు. ఆదివారం నాడు ఏ పనీ చేయబుద్ధికాదు. కొందరి రాక అసౌకర్యం కలిగిస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. బంధుమిత్రులతో విభేదిస్తారు. కొత్త సమస్య ఎదురయ్యే సూచనలున్నాయి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. ఆప్తులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. విజ్ఞతతో విభేదాలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. హోల్సేల్ వ్యాపారులకు కష్టసమయం. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. అంచనాలు ఫలిస్తాయి. రావలసిన ధనం అందుతుంది. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. ధనసహాయం, ప్రైవేట్ సంస్థలో మదుపు తగదు. సోమవారం నాడు ఆచితూచి అడుగేయాల్సిన సమయం. అనాలోచిత నిర్ణయం నష్టం కలిగిస్తుంది. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. పనులు అర్ధాంతంగా ముగిస్తారు. కీలక పత్రాలు అందుతాయి. ఇంటి విషయాలపై దృష్టిపెడతారు. సన్నిహితులతో తరుచు సంభాషిస్తారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉద్యోగ బాధ్యతల్లో పొరపాట్లు సరిదిద్దుకుంటారు. అధికారులకు హోదామార్పు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లకు ధీటుగా స్పందిస్తారు. చిరువ్యాపారాలు ఊపందుకుంటాయి. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
అన్నిరంగాల వారికీ యోగదాయకమే. మాట నిలబెట్టుకుంటారు. బంధుమిత్రులకు మీపై ప్రత్యేకాభిమానం కలుగుతుంది. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. వస్త్రప్రాప్తి, ధనలాభం ఉన్నాయి. మీ చొరవతో శుభకార్యం నిశ్యయమవుతుంది. బుధవారం నాడు చేసిన పనులే తిరిగి చేయవలసి వస్తుంది. తరచు ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. కుటుంబసౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. ఆరోగ్యం జాగ్రత్త. ఔషధసేవనం క్రమం తప్పకుండా పాటించండి. ఉపాధి పథకాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నూతన పెట్టుబడులకు అనుకూలం. వేడుకకు హాజరవుతారు. పందాలు, బెట్టింగ్లకు పాల్పడవద్దు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆర్ధికంగా ఫర్వాలేదనిపిస్తుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఆప్తులకు సాయం చేస్తారు. పనులు మరింత చురుకుగా సాగుతాయి. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. గురువారం నాడు పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. కిట్టని వ్యక్తులతో జాగ్రత్త. అవివాహితులకు శుభయోగం. గృహమరమ్మతులు చేపడతారు. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటుపోట్లను దీటుగా ఎదుర్కుంటారు. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. ప్రింటింగ్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. కీలక సమావేశంలో పాల్గొంటారు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కార్యసాధనకు మరింత ఓర్పుతో శ్రమించాలి. కలిసివచ్చిన అవకాశాన్ని తక్షణం అందిపుచ్చుకోండి. కొందరి వ్యాఖ్యులు ఆలోచింపచేస్తాయి. అనుమానాలు, అపోహలకు తావివ్వవద్దు. ఆదివారం నాడు ముఖ్యుల కలయిక వీలపడదు. పనులు, కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. దంపతులు ఏకాభిప్రాయానికి రాగల్గుతారు. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. సంతానం కృషి ఫలిస్తుంది. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. ఆహ్వానం అందుకుంటారు. పత్రాల్లో సవరణలు సాధ్యపడతాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వివాహయత్నం తీవ్రంగా సాగిస్తారు. కన్నల్టెంట్ లను ఆశ్రయించవద్దు. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ఉద్యోగస్తులకు పదోన్నతి, అధికారులకు హోదామార్పు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ప్రతికూలతలు అధికం. మీ కష్టం మరొకరికి కలిసివస్తుంది. ఆలోచనలు నిలకడగా ఉండవు. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. సోదరవర్గం బంధువులతో సమస్యలు తలెత్తుతాయి. ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. తెలియని వెలితి వెన్నాడుతుంది. మంగళవారం నాడు చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. చుట్టుపక్కల వారిని ఓ కంట కనిపెట్టండి. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ముఖ్యుల ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. దంపతుల మధ్య అవగాహనలోపం. ఆత్మీయులతో సంభాషణ ఊరటనిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. సంతానం దూకుడు వివాదాస్పదమవుతుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. మీ పథకాలు ఏమంత ఫలితమీయజాలవు. ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఓర్పు ప్రధానం. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కార్యసాధనకు నిర్విరామంగా శ్రమిస్తారు. అవకాశాలు అందినట్టే చేజారిపోతాయి. మీ సమర్ధతపై నమ్మకం సన్నగిల్లుతుంది. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. మీ ఉన్నతిని చాటుకోవటానికి విపరీతంగా ఖర్చు చేయవలసి వస్తుంది. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. మొహమ్మాటాలు, భేషజాలకు పోవద్దు. వాస్తవదృక్పథంతో ఆలోచించండి. అనుభవజ్ఞులను సంప్రదించటం శ్రేయస్కరం. ఆత్మీయులతో తరచు సంభాషిస్తుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. నోటీసులు అందుకుంటారు. దూరపు బంధువుల ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. ఆలోచనల్లో మార్పు వస్తుంది. వాయిదా పడిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదం
ఈ వారం ఆశాజనకం. కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు. మీ కృషి ఫలిస్తుంది. లక్ష్యానికి చేరవవుతారు. కలిసివచ్చిన అవకాశాన్ని తక్షణం అందిపుచ్చుకోండి. అనుమానాలు, అపోహలకు తావివ్వవద్దు. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. పెట్టుబడులపై దృష్టి పెడతారు. వాయిదా పడుతూ వస్తున్న పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. వివాహయత్నం తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. అవతలి వారి తాహతును క్షుణ్ణంగా తెలుసుకోండి. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. స్నేహసంబంధాలు బలపడతాయి. కంప్యూటర్, ప్రింటింగ్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతిలోపం. వేడుకల్లో అత్యుత్సాహం తగదు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. మనోధైర్యంతో అడుగు ముందుకేస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. బుధవారం నాడు దంపతుల మధ్య అకారణ కలహం. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. ఏ విషయానికీ తీవ్రంగా స్పందించవద్దు. ఆప్తుల రాక ఉపశమనం కలిగిస్తుంది. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. సంతానానికి శుభపరిణామాలున్నాయి. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. వ్యాపారాలు జోరుగా సాగుతాయి. చిన్న వ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం, దైవకార్యంలో పాల్గొంటారు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
లక్ష్యసాధనకు మరింత శ్రమించాలి. పరిస్థితులు నిదానంగా చక్కబడతాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. కష్టమనుక్ను పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఆర్ధికంగా బాగుంటుంది. విలాసాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. స్నేహసంబంధాలు బలపడతాయి. వివాహయత్నం ఫలించే సూచనలున్నాయి. మీ ఇష్టాయిష్టాలను స్పష్టంగా తెలియజేయండి. ఆరోగ్యం పట్ల అలక్ష్యం తగదు. ఆహార నియమాలు, ఔషధసేవనం క్రమం తప్పకుండా పాటించండి. శుక్రవారం నాడు అనుకోని సంఘటన ఎదురవుతుంది. కారక్రమాలు వాయిదా పడతాయి. ముఖ్యులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. ఉపాధి పథకాలు చేపడతారు. వృత్తులవారికి ఆదాయాభివృద్ధి. ప్రైవేట్ ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు పురోగతిన సాగుతాయి.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
గ్రహస్థితి అనుకూలంగా ఉంది. లక్ష్యానికి చేరువవుతారు. ఆశావహదృక్పధంతో యత్నాలు సాగించండి. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. మంగళవారం నాడు అప్రమత్తంగా ఉండాలి. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. ఆదాయం బాగుంటుంది. చెల్లింపుల్లో జాప్యం తగదు. మీ అలక్ష్యం ఇబ్బందులకు దారితీస్తుంది. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. గృహమరమ్మతులు చేపడతారు. వాహనం. విలువైన వస్తువులు జాగ్రత్త. మీ ప్రమేయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. పనులు త్వరితగతిన సాగుతాయి. చిన్ననాటి పరిచయస్తులతో సంభాషిస్తారు. ఒక వార్త సంతోషం కలిగిస్తుంది. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పనిభారం. ప్రయాణంలో అవస్థలెదుర్కుంటారు.