Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

11-04-2026 శనివారం ఫలితాలు - ఆర్ధిక ఇబ్బందులు అధికం

Advertiesment
Daily Horoscope
Daily Horoscope
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
పట్టుదలతో యత్నాలు కొనసాగించండి. మీ కృషిని అయిన వారు ప్రోత్సహిస్తారు. ఖర్చులు సామాన్యం. పనులు హడావుడిగా సాగుతాయి. ముఖ్యుల సందర్శన వీలుపడదు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. అనవసర జోక్యం తగదు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
సర్వదా అనుకూలం. కార్యం సిద్ధిస్తుంది. మానసికంగా స్థిమితపడతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. పనులు సానుకూలమవుతాయి. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. కొంతమొత్తం పొదుపు చేస్తారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
సంప్రదింపులు కొలిక్కివస్తాయి. వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు. పనులు సానుకూలమవుతాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. అప్రమత్తంగా ఉండాలి. అంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. ఆరోగ్యం జాగ్రత్త. మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఆప్తులకు సాయం అందిస్తారు. పనులు వేగవంతమవుతాయి. ఒప్పందాల్లో జాగ్రత్త వహించండి. ముఖ్యమైన పత్రాలు జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. దైవకార్యంలో పాల్గొంటారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. ప్రముఖులను ఆకట్టుకుంటారు. సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతలు, వ్యాపకాలు అధికమవుతాయి. కీలక పత్రాలు సమయానికి కనిపించవు. చిన్న విషయానికే చికాకుపడతారు. కీలక ఒప్పందాల్లో జాగ్రత్తగా ఉండాలి.
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఆర్ధిక ఇబ్బందులు అధికం. ఖర్చులు విపరీతం. నిస్తేజానికి లోనవుతారు. ఆప్తుల కలయిక ఉత్సాహపరుస్తుంది. ధైర్యంగా యత్నాలు సాగిస్తారు. పనులు సానుకూలమవుతాయి. గృహ మార్పు అనివార్యం. సోదరులను సంప్రదిస్తారు. పత్రాల్లో సవరణలు సాధ్యమవుతాయి. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయండి. అనాలోచిత నిర్ణయం తగదు. అనుభవజ్ఞులను సంప్రదించండి. పనుల్లో చికాకులు అధికం పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
మీదైన రంగంలో రాణిస్తారు. ఊహలు ఫలిస్తాయి. చాకచక్యంగా అడుగులేస్తారు. మీ వ్యక్తిత్వానికి గౌరవం లభిస్తుంది. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. చేసిన పనులే చేయవలసి వస్తుంది. నోటీసులు అందుకుంటారు. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. మీ సామర్ధ్యంపై ఎదుటివారికి గురి కుదురుతుంది. వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. అనాలోచిత నిర్ణయాలు తగవు. పెద్దల సలహా పాటించండి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. అనవసర విషయాలకు ప్రాధాన్యమివ్వవద్దు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
బాధ్యతగా వ్యవహరించండి. యాదృచ్చికంగా తప్పులు దొర్లే ఆస్కారం ఉంది. సాయం ఆశించవద్దు. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. పనులు ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. కార్యక్రమాలు సాగవు. నోటీసులు అందుకుంటారు.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
కార్య సిద్ధికి సంకల్పబలం ముఖ్యం. ఉత్సాహంగా యత్నాలు సాగించండి. మీ కృషి ఫలిస్తుంది. ఆదాయానికి ఖర్చులుంటాయి. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. కీలక పత్రాలు అందుకుంటారు. కీలక చర్చల్లో పాల్గొంటారు.
 
మీనం : పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
లావాదేవీలతో సతమతమవుతారు. రావలసిన ధనం అందుతుంది. రుణవిముక్తులవుతారు. ఖర్చులు అధికం. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. పనులు ఒక పట్టాన సాగవు. చిన్న విషయానికి చికాకు పడుతారు. మీ కోపతాపాలు అదుపులో ఉంచుకోండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

10-04-2026 శుక్రవారం ఫలితాలు- వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు..