Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

06-04-2016 సోమవారం ఫలితాలు - త్వరలో మీ కృషి చేస్తుంది

Advertiesment
Astrology
Astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కార్యసాధనలో సఫలీకృతులవుతారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ప్రముఖులకు చేరువవుతారు. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. పనులు వేగవంతమవుతాయి. వేడుకకు హాజరవుతారు. అత్యుత్సాహం ప్రదర్శించవద్దు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. విజ్ఞతతో వ్యవహరిస్తారు. కీలక బాధ్యతలు స్వీకరిస్తారు. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. నిలిపివేసిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. ఇతరుల విషయంలో జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసీ చూడనట్లు వదిలేయండి. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆచితూచి వ్యవహరించాలి. అందరితో మితంగా సంభాషించండి. అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. పెద్దలు తగులుతుంది. చేబదుళ్లు స్వీకరిస్తారు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. గృహమరమ్మతులు చేపడతారు. పత్రాల్లో సవరణలు సాధ్యపడదు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
సంప్రదింపులు కొలిక్కి వస్తాయి. కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. మానసికంగా కుదుటపడతారు. కొంతమొత్తం పొదుపు చేస్తారు. కొందరి రాత ఇబ్బంది కలిగిస్తుంది. పనులతో సతమతమవుతారు. అకాల భోజనం, విశ్రాంతి లోపం, పుణ్యకార్యంలో పాల్గొంటారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
మనోధైర్యంతో అడుగులేయండి. ఏ విషయాన్ని తీవ్రంగా పరిగణించవద్దు. అయిన వారు ప్రోత్సహిస్తారు. అవకాశాలు చేజారినా నిరుత్సాహపడవద్దు. త్వరలో మీ కృషి చేస్తుంది. ఖర్చులు సామాన్యం అధికం. ఫోన్ సందేశాలు నమ్మవద్దు.
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కార్యసాధనకు సంకల్పం ముఖ్యం. సన్నిహితుల వ్యాఖ్యలు ఉత్సాహాన్నిస్తాయి. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం జోక్యం తగదు. మీ శ్రీమతిలో మార్పు వస్తుంది. పత్రాలు అందుకుంటారు. వాహనం ఇతరులకిచ్చి ఇబ్బంది పడతారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వ్యవహారాలతో తీరిక ఉండదు. అకాలభోజనం, విశ్రాంతిలోపం, ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఖర్చులు అదుపులో ఉండవు. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను కచ్చితంగా తెలియజేయండి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
అనుకున్న కార్యం సాధిస్తారు. కొన్ని విషయాలు ఊహించినట్లే జరుగుతాయి. విలాసాలకు వ్యయం చేస్తారు. డబ్బుకు ఇబ్బంది ఉండదు. సంప్రదింపులు జరుపుతారు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. తలపెట్టిన పనులు అర్థాంతంగా నిలిపివేశారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు సాగుతారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ధనలాభం, వాహన సౌఖ్యం ఉన్నాయి. సకాలంలో పనులు పూర్తిచేస్తారు. ఆరోగ్యం సంతృప్తికరం. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. విలువైన వస్తువులు జాగ్రత్త 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
సన్నిహితుల సలహా పాటించండి. అనాలోచిత నిర్ణయాలు తగవు అందరితోను సామ్యంగా మెలగండి. ధనం మితంగా వ్యయం చేయండి. పసులు ముందుకు సాగవు ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. కొత్త వ్యక్తులతో జాగ్రత్త నోటీసులు అందుకుంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
అనుకూలతలు అంతంత మాత్రమే తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. దుబారా ఖర్చులు విపరీతం పనులు హడావుడిగా సాగుతాయి. ప్రముఖుల కలయిక వీలుపడదు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. 
 
మీనం : పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
మీ వాక్కు ఫలిస్తుంది. మాట నిలబెట్టుకుంటారు. ఆప్తులకు సాయం అందిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. నగరం, ఆభరణాలు. జాగ్రత్త, ఎవరినీ అతిగా విశ్వసించవద్దు, కీలక పత్రాలు అందుతాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. వివాదం సద్దుమణుగుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

05-04-26 ఆదివారం ఫలితాలు - అవసరాలకు ధనం అందుతుంది..