Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

10-04-2026 శుక్రవారం ఫలితాలు- వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు..

Advertiesment
daily horoscope
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
మీ సామర్థ్యాలపై నమ్మకం పెంచుకోండి. పరిచయస్తులు ధనసహాయం అర్థిస్తారు. పనులు సానుకూలతకు ఓర్పు, కృషి ప్రధానం, ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం నిరీక్షణ తప్పదు. ముఖ్యమైన వ్యవహారంలో జాగ్రత్తగా ఉండాలి. సన్మాన సంస్మరణ సభల్లో పాల్గొంటారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
లావాదేవీలు ఫలిస్తాయి. సముచిత నిర్ణయం తీసుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపకాలు సృష్టించుకుంటారు. వ్యాపకాలు సృష్టించుకుంటారు. పనులు ఇతరులకు అప్పగించవద్దు. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. బెట్టింగ్లకు పాల్బడవద్దు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
సంకల్పం సిద్ధిస్తుంది. ధనలాభం, వాహనసౌఖ్యం ఉన్నాయి. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. మాటతీరుతో ఆకట్టుకుంటారు. ముఖ్యుల వీలుపడదు. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. వివాదాలు పరిష్కారమవుతాయి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కలిసివచ్చే సమయం. ప్రతికూలతలకు ధీటుగా స్పందిస్తారు. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తి చేస్తారు. ఖర్చులు అధికం. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పెద్దలను సంప్రదిస్తారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ఆప్తులను విందుకు ఆహ్వానిస్తారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆశావహదృక్పథంతో యత్నాలు సాగిస్తారు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. అవకాశాలు కలిసివస్తాయి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ప్రతికూలతలు అధికం. శ్రమించినా ఫలితం అంతంత మాత్రమే. మీ సామర్థంపై నమ్మకం సన్నగిల్లుతుంది. ఆశావహదృక్పథంతో మెలగండి, పొదుపు ధనం గ్రహిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. పనులు మందకొడిగా సాగుతాయి. మీపై శకునాల ప్రభావం అధికం.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. ఆప్తులకు మీ సమస్యలు తెలియజేయండి. దంపతుల మధ్య అకారణ కలహం. దుబారా ఖర్చులు విపరీతం. ఒక సమాచారం ఉత్తేజపరుస్తుంది. స్థల వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. సర్వత్రా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. కొత్త యత్నాలు చేపడతారు. ఊహించని సంఘటన ఎదురవుతుంది. దంపతుల మధ్య దాపరికం తగదు. పత్రాల్లో సవరణలు సాధ్యపడతాయి. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
కార్యక్రమాలు విజయవంతమవుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మొండి బాకీలు వసూలవుతాయి. ఖర్చులు అధికం, ప్రముఖులకు సన్నిహితులవుతారు. అప్రమత్తంగా ఉండాలి. అజ్ఞాతవ్యక్తులు తప్పుదారి పట్టిస్తారు. మాటతీరు అదుపులో ఉంచుకోండి. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఒప్పదాల్లో అప్తసుత్తంగా ఉండాలి. అనాలోచిత నిర్ణయాలు తగను. మీ సమస్యలను సన్నిహితులకు తెలియజేయండి. ధన సమస్య ఎదురవుతుంది. పనులు అస్తవ్యంగా సాగటాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మధ్యవర్తులు, కన్సల్టీలను ఆశ్రయించవద్దు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ధైర్యంగా యత్నాలు సాగించండి. సాయం ఆశించవద్దు. శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. పనులు ఒక పట్టాన పూర్తికావు. చిన్న విషయానికే చికాకుపడతారు. మాటతీరు అదుపులో ఉంచుకోండి. కీలక పత్రాలు అందుతాయి. 
 
మీనం : పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
మీ పనితీరు ప్రశంసనీయమవుతుంది. కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. ఇతరుల కోసం విపరీతంగా వ్యయం చేస్తారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. ఆప్తుల రాక ఉత్సాహాన్నిస్తుంది. చర్చల్లో పాల్గొంటారు. చేపట్టిన పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జ్యోతిష్య శాస్త్రం: హనుమంతుడి దగ్గరయ్యే ఆ మూడు రాశులేవి?