Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

07-04-2026 మంగళవారం ఫలితాలు : రుణ ఒత్తిడి ఆందోళన కలిగిస్తుంది

Advertiesment
Daily Astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు సామాన్యం. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. అపరిచితులతో మితంగా సంభాషించండి. నోటీసులు అందుకుంటారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
రుణ విముక్తులవుతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. పనులు సానుకూలతకు మరింత శ్రమించాలి. ఖర్చులు అధికం. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది. ఆరోగ్యం జాగ్రత్త ఆప్తులతో కాలక్షేపం చేస్తారు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
వేడుకను ఆర్భాటంగా చేస్తారు. కానుకలిచ్చిపుచ్చుకుంటారు. నిలిపివేసిన పనులు పునఃప్రారంభమవుతాయి. పాత పరిచయస్తులు తారసపడతారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. సంప్రదింపులతో తీరిక ఉండదు. ఆత్మీయులతో సంభాషిస్తారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. రోజువారీ ఖర్చులుంటాయి. పనులు బాధ్యతలు అప్పగించవద్దు. పత్రాలు అందుకుంటారు. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. ఏకాగ్రతతో వాహనం నడపండి.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ప్రతికూలతల అధికం. కార్యసాధనకు మరింత శ్రమించాలి. అందరితోను మితంగా సంభాషించండి. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. గృహమరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. శుభకార్యానికి హాజరవుతారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
రుణ ఒత్తిడి ఆందోళన కలిగిస్తుంది. అన్యమనస్కంగా గడుపుతారు. సన్నిహితులతో సంభాషిస్తారు. పసులు మందకొడిగా సాగుతాయి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. దంపతుల మధ్య సఖ్యత లోపం. చీటికి మాటికి అసహనం చెందుతారు. ఆప్తుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వ్యవహార పరిజ్ఞానంతో నెట్టుకొస్తారు. ధనలాభం ఉంది. ప్రముఖులకు సన్నిహితులవుతారు. వ్యాపకాలు అధికం. కాని ప్రత్యర్థులతో జాగ్రత్త. మీ చొరవతో ఒకరికి మంచి జరుగుతుంది. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. కార్యక్రమాలు ముందుకు సాగవు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. ముఖ్యమైన పనులతో తీరిక ఉండదు. ఖర్చులు విపరీతం. పెట్టుబడుల విషయం పునరాలోచించండి. తొందరపాటు నిర్ణయాలు తగదు. ముఖ్యుల కలయక వీలుపడదు. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యవహారదక్షతతో నెట్టుకొస్తారు. నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్త. పనులు చురుకుగా సాగుతాయి. సోదరులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పుణ్యకార్యంలో పాల్గొంటారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కష్టించినా ఫలితం అంతంత మాత్రమే సమర్థతకు గుర్తింపు ఉండదు. యత్నాలు కొనసాగించింది. వ్యవహారాలతో తలమునకలవుతారు. అనుకుంటారు. కావలసిన పత్రాలు సమయానికి కనిపించవు, ఆరోగ్యం జాగ్రత్త, ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆందోళన కలిగించిన సద్దుమణుగుతుంది. ఉత్సాహంగా యత్నాలు సాగిస్తారు. దుబారా ఖర్చులు విపరీతం పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు, కార్యక్రమాలు ముందుకు సాగపు ఆహ్వానం అందుకుంటారు. 
 
మీనం : పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. వ్యతిరేకులు వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. పనులు చురుకుగా సాగుతాయి. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. ఆలయాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

06-04-2016 సోమవారం ఫలితాలు - త్వరలో మీ కృషి చేస్తుంది