Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

05-04-26 ఆదివారం ఫలితాలు - అవసరాలకు ధనం అందుతుంది..

Advertiesment
Daily Astrology
Daily Astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కార్యక్రమాలు విజయవంతమవుతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఖర్చులు విపరీతం. అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. అప్రమత్తంగా ఉండాలి. పత్రాల్లో సవరణలు అనివార్యం. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
సమస్యలు తొలగుతాయి. మానసికంగా కుదుటపడతారు. ఖర్చులు అధికం. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. పనులు మందకొడిగా సాగుతాయి. వాహనదారులకు అత్యుత్సాహం తగదు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కార్యం నెరవేరుతుంది. పరిచయస్తుల వ్యాఖ్యలను ధీటుగా ఎదుర్కుంటారు. మీ విజ్ఞతకు ప్రశంసలు లభిస్తాయి. విలాసాలను వ్యయం చేస్తారు. పనులు ముందుకు సాగవు. మీ జోక్యం అనివార్యం. సన్మాన సాహిత్య సభల్లో పాల్గొంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
మీదైన రంగంలో నిలదొక్కుకుంటారు. ముఖ్యులతో పరిచయాలేర్పడతాయి. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. ప్రణాళికాబద్ధంగా పనులు సిద్ధం చేసుకుంటారు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. వివాదాలు సద్దుమణుతాయి. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కార్యసాధనకు మరింత శ్రమించాలి. ఓర్పుతో యత్నాలు సాగించండి. ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. దంపతుల మధ్య అకారణ కలహం. ఇంటి విషయాలపై దృష్టి సారిస్తారు. దుబారా ఖర్చులు విపరీతం అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు.
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కొంతమేరకు అనుకూలం. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. కుటుంబీకుల ప్రోత్సాహం ఉంటుంది. అవసరాలకు ధనం అందుతుంది. అప్రియమైన వార్త వింటారు. పనులు ముందుకు సాగవు. సోదరులను సంప్రదిస్తారు. పాతమిత్రుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వ్యవహార పరిజ్ఞానంతో రాణిస్తారు. మీ జోక్యంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. దుబారా ఖర్చులు అధికం. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. వస్త్రప్రాప్తి, కుటుంబ సౌఖ్యం ఉన్నాయి. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. వాహనం ఇతరులకు ఇవ్వవద్దు.
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ప్రముఖులకు ఆకట్టుకుంటారు. ఆశించిన పదవులు రాకపోవచ్చు. ఉత్సాహంగా యత్నాలు సాగించండి. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పనుల్లో శ్రమ అధికం. మీ ప్రమేయంతో ఒకరికి మంచి జరుగుతుంది. ప్రయాణ లక్ష్యం నెరవేరుతుంది. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. వ్యతిరేకులు చేరువవుతారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. సకాలంలో పనులు పూర్తిచేస్తారు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఉల్లాసంగా గడుపుతారు. జాదాలు, బెట్టింగ్‌లకు పాల్పడవద్దు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
మనోధైర్యంతో యత్నాలు మొదలెట్టండి. ఏ విషయాన్నీ సమస్యగా భావించవద్దు. ఖర్చులు విపరీతం. ఆరోగ్యం జాగ్రత్త అనవసర విషయాల్లో జోక్యం తగదు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. కీలక చర్చల్లో పాల్గొంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
మీ సమర్థతపై నమ్మకం పెంచుకోండి. అనుకున్నది సాధిస్తారు. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. ఖర్చులు అదుపులో ఉండవు. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు, కార్యక్రమాలు ముందుకు సాగవు. గృహమార్పు అనివార్యం. వేడుక హాజరు కాలేరు. 
 
మీనం : పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. చాకచక్యంగా అడుగులేస్తారు. రావలసిన ధనం అందుతుంది. ఏ పనీ చేయబుద్ధికాదు. వ్యవహారాలతో సతమతమవుతారు. మీ చిత్తశుద్ధిని కొంతమంది శంకిస్తారు. మనో ధైర్యంతో మెలగండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

05-04-2026 నుంచి 11-04-2026 వరకు ఫలితాలు- మీ శ్రీమతిని కష్టపెట్టొద్దు...