Publish Date: Sat, 04 Apr 2026 (19:41 IST)
Updated Date: Sat, 04 Apr 2026 (19:43 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ప్రతికూలతలు అధికం. లావాదేవీలతో తీరిక ఉండదు. ఆచితూచి అడుగేయాలి. అనుభవజ్ఞులను సంప్రందించండి. ఏకపక్ష నిర్ణయం తగదు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. ఆదివారం పనులు మందకొడిగా సాగుతాయి. ఆత్మస్థైర్యంతో యత్నాలు సాగించండి. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. సన్నిహితులతో తరుచుగా సంభాషిస్తారు. దంపతుల మధ్య స్వల్ప కలహం చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవద్దు. ఇంటి విషయాలపై దృష్టిపెట్టండి. ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. చెల్లింపుల్లో జాప్యం తగదు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. నూతన వ్యాపారాలకు తరుణం కాదు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. విద్యార్థులకు అత్యుత్సాహం తగదు. ఊహించని సమస్య ఎదురవుతుంది.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
పరిస్థితులు అనుకూలిస్తాయి. మెండిధైర్యంతో ముందుకు సాగుతారు. తలచిన కార్యం నెరవేరుతుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ధనసహాయం తగదు. మీ ఇబ్బందులను సున్నితంగా తెలియజేయండి. పనులు చురుకుగా సాగుతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. నోటీసులు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. శనివారం నాడు ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు, పనిభారం ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఒత్తిడి. శ్రమ అధికం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
అన్ని రంగాల వారికీ యోగదాయకమే. వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. అనుకున్న లక్ష్యం సాధిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఆశలొదిలేసుకున్న ధనం అందుతుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. చేపట్టిన పనులు సావకాశంగా పూర్తిచేస్తారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. బుధవారం నాడు అవగాహన లేని విషయంలో జోక్యం తగదు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. సంతాన సౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. గృహనిర్మాణం పూర్తి కావస్తుంది. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. చిరువ్యాపారులు ఆదాయం బాగుంటుంది. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. న్యాయవాదులకు ఆదాయాభివృద్ధి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
అన్ని రంగాల వారికీ బాగుంటుంది. అనుకున్నది సాధిస్తారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ఆదాయం సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు అనుకూలిస్తాయి. గురువారం నారు అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసి చూడనట్టు వదిలేయండి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. ప్రకటనలు, కొత్త వ్యక్తులను నమ్మవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం, వ్యాపారాలు జోరుగా సాగుతాయి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. సోదరుల మధ్య అవగాహన నెలకొంటుంది.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
లావాదేవీలతో తీరిక ఉండదు. ఆలోచనలతో సతమతమవుతారు. ఏ విషయంపై ఆసక్తి వుండదు. ఆచితూచి అడుగేయాలి. చేపట్టిన పనులు ఒక పట్టాన పూర్తికావు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఊహించని ఖర్చు చికాకుపరుస్తుంది. ఆపత్సమయంలో సన్నిహితుల చేయూతనిస్తారు. మంగళవారం నాడు ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో అనంత నెలకొంటాయి. ఉప్పు, పట్టుదలతో యత్నాలు సాగించండి. నోటీసులు అందుకుంటారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలను కచ్చితంగా తెలియజేయండి. అనాలోచిత చర్యలు తగవు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. ఉపాధి పథకాల నిరుత్సాహపరుస్తాయి. ప్రయాణం తలపెడతారు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
లక్ష్యసాధనకు కృషి పట్టుదల ప్రధానం. ఓర్పుతో యత్నాలు కొనసాగించండి. సాయం ఇతరులను ఆశించవద్దు. దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. బుధవారం నాడు పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. దంపతుల మధ్య అవగాహన లోపం. చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవద్దు సంతానం పై చదువులపై దృష్టిపెడతారు. ముఖ్యుల కలయిక వీలుపడదు, ఆలోచనల్లో మార్పు వస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ప్రియతములతో తరచు సంభాషిస్తారు. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. ప్రైవేట్ ఉపాధ్యాయులను ఒత్తిడి, అధికం. వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
తలపెట్టిన కార్యం సఫలమవుతుంది. సమర్థతను చాటుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలేర్పడతాయి. శనివారం నాడు చేపట్టిన పనులు ఒక పట్టాన సాగవు. ఆప్తుల వ్యాఖ్యలు ఉత్సాహం కలిగిస్తాయి. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. సంస్థల స్థాపనలకు అనుకూలం. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. సంతానం పై చదువులపై దృష్టి పెడతారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. కుటుంబసౌఖ్యం పొందుతారు. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. దూరపు బంధువులతో సంభాషిస్తారు. వ్యాపారాలు జోరుగా సాగుతాయి. ఆటుపోట్లకు దీటుగా స్పందిస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతి. ఉపాధి పథకాలు పురోగతిన సాగుతాయి. విద్యార్థులు నుంచి ఫలితాలు సాధిస్తారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ప్రతి విషయంలో దూకుడుగా వ్యవహరిస్తారు. మీ వైఖరి కొందరికి మనస్తాపం కలిగిస్తుంది. అందరితోను సామరస్యంగా మెలగండి. ఎవరినీ కించపరచవద్దు. బంధువర్గం వారితో విభేదిస్తారు. కొత్త సమస్య తలెత్తే సూచనలున్నాయి. దంపతుల మధ్య చీటికి మాటికి కలహాలు. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. ఆదాయం బాగుంటుంది. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. రావలసిన ధనాన్ని లౌక్యంగా రాబట్టుకోవాలి. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. నోటీసులు అందుకుంటారు. ఒకే సమాచారం అందోళన కలిగిస్తుంది. న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతారు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. చిరువ్యాపారులకు నిరాశాజనకం, ఉద్యోగ బాధ్యతలపై దృష్టి పెట్టండి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలో ఏకాగ్రత ప్రధానం. కీలక చర్చల్లో పాల్గొంటారు.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఈ వారం కలిసివచ్చే సమయం. సంప్రదింపులు పురోగతిన సాగుతాయి. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. ప్రతి విషయంలోను ధైర్యంగా ముందుకు సాగుతారు. ఆదాయానికి తగ్గట్టుగా బడ్జెట్ వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. చెల్లింపులు, నగదు స్వీకరణలో ఏకాగ్రత అవసారం. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు, ప్రయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. అవతలి వారి స్థోమతకు స్వయంగా తెలుసుకోండి. మీ శ్రీమతిలో మార్పు వస్తుంది. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. పత్రాల్లో సవరణలు సాధ్యమవుతాయి. నూతన వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. ఆకర్షణీయమైన వాక్చాతుర్యతతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. ప్రైవేట్ ఉపాధ్యాయులకు శ్రమ అధికం. సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ప్రణాళికలు పరిష్కార దిశగా సాగుతాయి.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి. సమర్థతను చాటుకుంటారు. సంప్రదింపులతో తీరిక లేకుండా గడుపుతారు. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత ముఖ్యం. ప్రలోభాలకు లొంగవద్దు, ఆదాయం బాగుంటుంది. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. గురువారం నారు ప్రముఖుల ఇంటర్వ్యూ అనుకూలించదు. మొండి ధైర్యంతో ముందుకు సాగుతారు. ఆలస్యంగానైనా పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. విజయం సంతోషం కలిగిస్తుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. మీ సాయంతో ఒకరి మంచి జరుగుతుంది. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వైద్య, న్యాయ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆదాయానికి లోటుండదు. ఖర్చులు సంతృప్తికరం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనులు వేగవంతమవుతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. ఆదివారం నాడు అనవసర విషయాల్లో జోక్యం తగదు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. సంతానం ఉన్నత చదువులపై దృష్టిస్తారు. గృహనిర్మాణం పూర్తి కానుంది. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. ఉద్యోగయోగం వుంది. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. అనుకున్న మొక్కులు తీర్చుకుంటారు.
మీనం : పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
శ్రమాధిక్యత మినహా ఫలితం శూన్యం. వ్యవహారంలో తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. అనుభవజ్ఞుల సలహా పాటించండి. మొహమ్మాటాలు, భేషజాలకు పోవద్దు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. మంగళవారం నాడు ఆచితూచి అడుగేయండి. పొగిడే వ్యక్తులతో జాగ్రత్త. కొందరి రాక చికాకు పరుస్తుంది. మీ శ్రీమతిని కష్టపెట్టవద్దు. సామరస్యంగా మెలగండి. సంతానానికి శుభపరిణామాలున్నాయి. దూరపు బంధువులతో సంభాషిస్తారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. ఆత్మీయులతో తరచుగా సంభాషిస్తారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు హోదామార్చు, స్థానచలనం, నూతన వ్యాపారాలకు తరుణం కాదు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు.