Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాదయాత్రలో స్వల్పంగా గాయపడిన నారా లోకేశ్

nara lokesh hand injury
, సోమవారం, 18 డిశెంబరు 2023 (14:17 IST)
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తన పాదయాత్రలో స్వల్పంగా గాయపడ్డారు. ఆయన పాదయాత్ర విశాఖ జిల్లాలోని పరవాడ మండలం వచ్చే సమయంలో ఆయన కుడిచేతి చీలమండకు కొద్దిపాటి గాయమైంది. అభిమానులకు అభివాదం తెలిపే సమయంలో ఆయన చేతిన ఒక వ్యక్తి బలంగా నొక్తాడు. దీంతో చీలమండపై నరం ఒత్తిజడికి గురై వాచిపోయింది. అయినా నారా లోకేశఅ మాత్రం తన పాదయాత్రను కొనసాగించారు. అభిమానులకు కరచాలం చేసేటపుడు ఎడమ చేతిని మాత్రమే ఉపయోగించారు. మధ్యమధ్యలో లోకేశ్ గాయానికి ఐస్‌క్యూబ్‌లతో మర్ధన చేశారు. 
 
మరోవైపు, నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్ర సోమవారంతో ముగియనుంది. విశాఖలోని ఆగనంపూడి వద్ద పాదయాత్ర ముగియబోతోంది. మరోవైపు ఈ నెల 20న విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద పాదయాత్ర విజయోత్సవ సభను టీడీపీ భారీ ఎత్తున నిర్వహించనుంది. 
 
ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు. ఈ సభ నుంచే టీడీపీ, జనసేన ఉమ్మడిగా ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నాయి. ఇరువురు నేతలు ఆ రోజు కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ సభకు ఇరు పార్టీలకు సంబంధించి లక్షలాది మంది తరలిరానున్నారు. ఇప్పటికే 7 ప్రత్యేక రైళ్లను తెలుగుదేశం ఏర్పాటుచేసింది. 

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై నటి విజయశాంతి ప్రశంసలు 
 
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరుపై కాంగ్రెస్ పార్టీ మహిళా నేత, నటి విజయశాంతి ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావమైన తర్వాత శాసనసభ సమావేశాలు తొలిసారి విధానపరంగా జరుగుతున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ పరిణామం ఎంతో ఆనందదాయకమన్నారు. 
 
ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత రాష్ట్ర మూడో అసెంబ్లీ సమావేశాలు ఇటీవల ప్రారంభమై సజావుగా సాగుతున్నాయి. దీనిపై విజయశాంతి స్పందిస్తూ, 2014 తర్వాత సమావేశాలు ఇంత సాఫీగా, హుందాగా జరుగుతుండటం ఇదే తొలిసారన్నారు. సచివాలయం కూడా ఇపుడు పూర్తి స్థాయిలో పని చేస్తుందని తెలిపారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణాలో దాదాపు దశాబ్దం తర్వాత ప్రజాస్వామ్య పంథాలో పనిచేస్తుందని పేర్కొన్నారు
 
ఇది ప్రజా ప్రభుత్వమన్నారు. అందువల్ల అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రజాస్వామ్య పంథాలోనే నడుస్తుందని, కోట్లాడి మందికి ఇపుడిపుడే విశ్వాసం ఏర్పడుతుందన్నారు. అంతేకాకుండా 26 యేళ్ల పోరాటం తర్వాత మీ రాములమ్మ ఇపుడు ఏం చేయాలని ఎవరైనా తనను అడిగితే.. తెలంగాణ ప్రజలకు కాలం మేలు చేయాలని, ఈ భూమి బిడ్డల భవిష్యత్ ఎప్పటికీ బాగుండాలని మాత్రం మనస్ఫూర్తిగా కోలుకుంటానని విజయశాంతి పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారతదేశం వ్యాప్తంగా ‘ఇసుజు ఐ-కేర్ శీతాకాల శిబిరం’ని ప్రారంభించిన ఇసుజు మోటర్స్ ఇండియా