గాంధీజయంతి సందర్భంగా స్వతంత్ర్య సమరయోధులకు సన్మానం చేయడం సంతోషమని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు.
గాంధీ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్ధులు భావి భారత నిర్ణేతలని గాంధీజీ అన్నారని గుర్తు చేశారు. యువతకు గాంధీజీ ఇచ్చిన సందేశాలు కాలంతో సంబంధం లేకుండా సమకాలీనమేనని కొనియాడారు.
గాంధీజీ ఆలోచనలు, విధానాలు ఉపాధ్యాయులకు చాలా ఉపయోగపడతాయని చెప్పారు. సత్యమేవ జయతే అని మహాత్ముడు చెప్పారని, అహింస, సత్యం మాట్లాడటం గాంధీజీ నేర్పిన అంశాలని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు మర్చిపోలేనివని, తెలుగు తనకు అర్ధం కాకపోయినా, విద్యార్ధుల మాటల్ని వారి ఉద్వేగం నుంచి అర్ధం చేసుకున్నానని పేర్కొన్నారు.