Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహానంది దేవస్థానం సమీపంలో చిరుత

Advertiesment
Cheetah
లాక్‌డౌన్ నేపథ్యంలో వణ్యప్రాణాల సంచారం రోజురోజుకు పెరుగుతోంది. తిరుమల ఘాట్ రోడ్డులోనూ వన్యప్రాణుల సంచారం ఎక్కువగా ఉంది.
 
తాజాగా, కర్నూలు జిల్లా మహనంది పుణ్యక్షేత్రం సమీపంలో కనిపించిన చిరుత ఓ పందిపిల్లను పట్టుకుని చెట్టెక్కింది. గమనించిన పందులన్నీ ఒక్కసారిగా అరవడంతో పందిపిల్లను వదిలేసి అడవివైపు వెళ్లి పొదల్లో నక్కి మాటువేసింది.

ఆ తర్వాత కాసేపటికే పందులపై దాడిచేసి ఓ పందిపిల్లను నోట కరుచుకుని అడవిలోకి వెళ్లిపోయింది. గమనించిన గోశాల కాపలాదారు దేవస్థానం అధికారులు, స్థానికులకు సమాచారం అందించడంతో వారొచ్చి చిరుత కోసం గాలిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పల్లెలపై కరోనా పంజా?