Publish Date: Thu, 04 Jun 2020 (09:12 IST)
Updated Date: Thu, 04 Jun 2020 (09:14 IST)
లాక్‌డౌన్ నేపథ్యంలో.. రెండు నెలలుగా తిరుమల ఘాట్ రోడ్డును మూసివేయడంతో జన సంచారం లేకపోవడంతో వన్య ప్రాణులు స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో తిరుమలలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. బుధవారం తెల్లవారుజామున కర్ణాటక సత్రం, రింగురోడ్డు సమీపంలో చిరుత సంచరించిన దృశ్యాలు అక్కడి సిసిటివి కెమెరాలో రికార్డయ్యాయి.
దీంతో చిరుత రెండు రోజలుగా అక్కడ సంచరిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. దీంతో స్థానిక మఠాలలో ఉంటున్న సిబ్బంది భయాందోళనలకు గువరుతున్నారు. దీంతో అటవీ అధికారులు ఈ ప్రాంతంలో నిఘా పెంచారు.