Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చంద్రబాబు ఆరోగ్యం ఉన్నారా? హెల్త్ బులిటెన్ రిలీజ్

Advertiesment
chandrababu
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌ కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారా లేదా అనే విషయంపై రాజమహేంద్రవరం జైలు అధికారులు ప్రత్యేకంగా ఒక హెల్త్ బులిటెన్‌ను రిలీజ్ చేశారు. రాజమండ్రి ప్రభుత్వం వైద్యులు చంద్రబాబును పరిశీలించి ఇచ్చిన వివరాల మేరకు ఈ బులిటెన్‌ను రూపొందించారు. ఈ బులిటెన్‌లో చంద్రబాబు ఖైదీ నంబరుతో పాటు ఆయన రిమాండ్ ముద్దాయి అని పేర్కొనడం గమనార్హం. 
 
ఇకపోతే, ఆయన ఆరోగ్య పరిస్థితి విషయానికి వస్తే చంద్రబాబుకు బీబీ 130/80, శరీర ఉష్ణోగ్రత సాధారణంగాను, పల్స్ 64/మినిట్, శ్వాస 12/ మినిట్, హార్ట్ రేట్ ఎస్1, ఎస్ 2, ఆక్సిజన్ శాచ్యురేషన్, గచి వాతావరణం వద్ద 96శాతం, ఊపిరితిత్తులు క్లియర్, శారీరక, క్రియాశీలత బాగుందని, బరువురు 67 కేజీలుగా ఉన్నారని పేర్కొంది. ఈ హెల్త్ బులిటెన్ ప్రకారం చూస్తే చంద్రబాబు ఆరోగ్యంగానే ఉన్నట్టు తెలుస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇన్ఫోసిస్ కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం జగన్