Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వైసిపి ఎంపీ Gorantla Madhav న్యూడ్ కాలింగ్ చూసే గతి పట్టింది: సోమిరెడ్డి ఆగ్రహం

Advertiesment
somireddy
, శుక్రవారం, 5 ఆగస్టు 2022 (12:49 IST)
ఏపీలో రాసలీలలతో మునిగితేలుతున్నవారికి, రేప్ కేసుల్లో ముద్దాయిలుగా వున్నవారికి అవార్డులు ఇవ్వడం సీఎం జగన్ మోహన్ రెడ్డికి అలవాటైందని విమర్శించారు మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఆజాదీ అమృత్ మహోత్సవ్ వేడుకల వేళ... ఏపీలో వైసిపి ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియోలు చూడాల్సిన గతి పట్టిందని అన్నారు.

 
ఇలాంటివారు వాడుతున్న భాషను, ప్రవర్తించిన తీరును చూసైనా చర్యలు తీసుకోవాల్సిందని అన్నారు. ప్రజలు వైసిపి నాయకులు వాడుతున్న భాష పట్ల, ప్రవర్తిస్తున్న తీరును చూసి తల దించుకునే పరిస్థితిలోకి వెళ్తున్నారని అన్నారు. 

 
వైసిపి ఎంపీ గోరంట్ల మాధవ్ పైన వచ్చిన అసభ్య వీడియో చర్చనీయాంశంగా మారింది. మాధవ్ అది ఓ ఫేక్ వీడియో అనీ, మార్ఫింగ్ చేసారంటూ మండిపడ్డారు. దీనిపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.

 
ఎంపీ మాధవ్ పైన వచ్చిన ఆరోపణలు గురించి ప్రభుత్వం వెంటనే విచారణకు ఆదేశాలు జారీ చేసింది. మాధవ్ తనపై వచ్చిన ఆరోపణలు ఖండించారు. మార్ఫింగ్ వీడియో అని పోలీసులకు ఫిర్యాదు చేసారు. ప్రస్తుతం దర్యాప్తులో వుంది. అది మార్ఫింగ్ కాదు, నిజమైనదే అని నిరూపణ అయితే గోరంట్లపై కఠిన చర్యలు తప్పవు. ఎవరైనా మహిళలను కించపరిస్తే ప్రభుత్వం ఉపేక్షించదు అంటూ చెప్పారాయన.

 
కాగా వైసిపి ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో హల్చల్ చేస్తోంది. అందులో గోరంట్ల మాధవ్ నగ్నంగా వున్నారనీ, ఓ మహిళతో మాట్లాడుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై వైసిపి ఎంపీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసారు. తను జిమ్ లో వ్యాయామం చేస్తున్నప్పుడు ఎవరో వీడియో తీసారనీ, దాన్ని మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా చిత్రీకరించి వైరల్ చేస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియాలో ఆ వీడియోను ఎవరు అప్ లోడ్ చేసారో వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

 
ఇలాంటి చౌకబారు వ్యవహారాలు కాకుండా ఏదైనా వుంటే ఫేస్ టు ఫేస్... దమ్ముంటే తన ముందుకు రావాలని సవాల్ విసిరారు. తెలుగుదేశం పార్టీ తనపై చేస్తున్న కుట్రలో ఇదో భాగమని ఆరోపించారు. అప్ లోడ్ చేసిన వీడియోను ఫోరెన్సిక్ ల్యాబుకి పంపి తనపై బురద జల్లుతున్నవారి భరతం పడతామంటూ వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీవీ చర్చలో రిషి సునక్ ముందంజ.. వెనుకబడిన లిజ్ ట్రస్