Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాలికకు ఆటో డ్రైవర్ వేధింపులు, దేహశుద్ధి చేసిన ఆమె తల్లి, వీడియో వైరల్

బాలికకు ఆటో డ్రైవర్ వేధింపులు, దేహశుద్ధి చేసిన ఆమె తల్లి, వీడియో వైరల్
, బుధవారం, 18 మార్చి 2020 (14:48 IST)
ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా మహిళలపై జరుగుతున్న వేధింపులు, దాడులు ఆగడంలేదు. ముఖ్యంగా కళాశాలలు, పాఠశాలలకు వెళ్లే యువతులు, బాలికలపై కొందరు పోకిరీలు చేసే వేధింపులు మితిమీరిపోతున్నాయి. పాలకోడేరు మండలంలోని విస్సాకోడేరులో ఓ బాలికపై ఆటో డ్రైవర్ వేధింపులకు పాల్పడిన ఘటన, అతడికి దేహశుద్ధి చేసిన వీడియో ఇపుడు వైరల్ అయ్యింది.
 
వివరాల్లోకి వెళితే... పాలకోడేరు మండలం విస్సాకోడేరు హైస్కూల్‌లో ఓ బాలిక చదువుకుంటుండగా, మొగల్తూరు మండలం పేరుపాలానికి చెందిన రమేష్ అనే ఆటో డ్రైవరు ఆమెను గత కొంతకాలంగా వెంబడిస్తూ వున్నాడు. దారి మధ్యలో ఆమెను అడ్డగించేందుకు ప్రయత్నించడమే కాకుండా, ఆమె వెంటపడుతూ వున్నాడు.

ఈమధ్య బాలిక పేరును పచ్చబొట్టు పొడిపించుకుని వేధింపులు రెట్టింపు చేశాడు. దీనితో సదరు బాలిక విషయాన్ని తన తల్లి దృష్టికి తీసుకుని వెళ్లింది. దీనితో వారు అతడిని రెండుసార్లు మందలించి వదిలేశారు.
 
వారి మందలింపును లైట్‌గా తీసుకున్న ఆటో డ్రైవర్ రమేష్ ఎప్పటిలాగానే తన వెకిలి వేషాలు మొదలుపెట్టాడు. ఐదు రోజుల క్రితం వేధింపులకు పాల్పడ్డాడు. దీనితో మళ్లీ బాలిక విషయాన్ని తల్లికి చెప్పింది. అంతే... ఆమె ఆవేశంతో ఊగిపోయింది. దారిని వెళుతున్న ఆటో డ్రైవరు రమేష్‌ను ఆపి చొక్కా విప్పి దేహశుద్ధి చేసింది.

ఇదంతా పాఠశాల వద్ద విద్యార్థుల ముందు జరిగింది. విషయాన్ని అతడి తల్లిదండ్రులు గోప్యంగా వుంచినప్పటికీ వీడియో బయటకు రావడంతో పోలీసుల దృష్టికి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆటో డ్రైవరును అరెస్టు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశానికి కాలసర్ప దోషం ఉంది: శారద పీఠాధిపతి