Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అర్థరాత్రి మహిళను లాక్కెళ్లి గ్రామ సచివాలయంలో అత్యాచారం

Advertiesment
rape victim

సెల్వి

, శుక్రవారం, 5 డిశెంబరు 2025 (11:19 IST)
ఏలూరులో దారుణం చోటుచేసుకుంది. ఏలూరులో రౌడీ షీటర్లు బరితెగించారు. ఇంట్లో ఒంటరిగా వున్న యువతిని అర్థరాత్రి లాక్కెళ్లారు. ఆపై ప్రభుత్వ కార్యాలయమైన సచివాలయంలోనే ఆమె అత్యాచారానికి పాల్పడ్డారు. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఓ యువతి ఏలూరు టూటౌన్ పరిధిలోని తన స్నేహితురాలి ఇంట్లో ఉంటోంది. 
 
స్నేహితురాలి కుటుంబ సభ్యులు తిరుపతి వెళ్లిన విషయాన్ని స్థానిక రౌడీ షీటర్లు పులిగడ్డ జగదీశ్ బాబు, లావేటి భవాని కుమార్ పసిగట్టారు. ఇదే అదనుగా భావించి, అర్ధరాత్రి సమయంలో ఆ ఇంటిపై దాడి చేశారు. తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించి, యువతిని బలవంతంగా బయటకు లాక్కెళ్లారు. 
 
ఆపై యువతిని సమీపంలోని గ్రామ సచివాలయంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తామని బాధితురాలిని బెదిరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీబీఐ కేసును కొట్టివేయాలి.. వై. శ్రీలక్ష్మి పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ఆదేశాలు రిజర్వ్