రోడ్లు వెంట వుండే పానీపూరీలను చాలామంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఐతే అలాంటి వారు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే... పానీపూరీ తినేటప్పుడు అత్యంత జాగ్రత్త వహించకపోతే ఎలాంటి సమస్య వస్తుందో దీన్ని చూస్తే తెలుస్తుంది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఔరియా జిల్లాలో ఓ మహిళ పానీపూరి తినాలనుకుని రోడ్డు పక్కనే వున్న బండి దగ్గరకు వెళ్లింది.
షాపు వ్యక్తి పానీపూరీలు ఇస్తుంటే ఆబగా నోరు తెరిచి పానీపూరీలు చక్కగా తింటోంది. ఇంతలో కాస్తంత పెద్దసైజు పానీపూరీ వచ్చింది. దాన్ని కూడా నోట్లో పట్టించాలని కాస్త గట్టిగా నోరు తెరిచింది. ఫటక్ మంటూ దవడ ఎముక విరిగింది. దీనితో ఆమె నోరు తెరిచింది తెరిచినట్లే వుండిపోయింది. నోరు మూసేందుకు వీలుపడకపోగా తీవ్రమైన నొప్పి వుండటంతో సమీపంలో ఆసుపత్రికి వెళ్లింది. ఆమె పరిస్థితిని చూసిన వైద్యులు అధునాతన శస్త్రచికిత్స అవసరమైన పెద్దాసుపత్రికి సిఫార్సు చేసారు. కనుక పానీపూరీలు తినేటప్పుడు తస్మాత్ జాగ్రత్తగా వుండాలంటున్నారు.