Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కేరళ పంచాయతీ ఎన్నికల్లో సోనియా గాంధీ పోటీ

Advertiesment
sonia gandhi

ఠాగూర్

, మంగళవారం, 2 డిశెంబరు 2025 (16:01 IST)
కేరళ రాష్ట్ర పంచాయతీ ఎన్నికలు వచ్చే నెలలో జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరపున సోనియా గాంధీ పేరుతో ఉండే ఓ మహిళ పోటీ చేస్తోంది. దీంతో బీజేపీ తరపున సోనియా గాంధీ పోటీ చేస్తోందంటూ సోషల్ మీడియాలో బీజేపీ శ్రేణులు విస్తృతంగా ప్రచారంచేస్తున్నాయి. 
 
వచ్చే నెలలో జరుగనున్న పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య తీవ్రపోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో భాజపా అభ్యర్థి 'సోనియా గాంధీ' తండ్రి, దివంగత దురే రాజ్ గతంలో కాంగ్రెస్‌ కార్యకర్తగా పని చేశాడు. తమ పార్టీ అగ్రనేత సోనియా గాంధీపై ఉన్న అభిమానంతో తన కుమార్తెకు ఆమె పేరును పెట్టుకున్నాడు. 
 
కొన్నేళ్ల క్రితం ఆమెకు భాజపా కార్యకర్త, పంచాయతీ ప్రధాన కార్యదర్శి సుభాష్‌తో వివాహం అయింది. భర్త మద్దతుతో సోనియా గాంధీ త్వరలో జరగనున్న మున్నార్‌ పంచాయతీ ఎన్నికల్లో భాజపా అభ్యర్థిగా బరిలోకి దిగారు. 
 
మున్నార్‌ పంచాయతీ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి మంజుల రమేష్‌కు ఇది తల నొప్పిగా మారింది. కాంగ్రెస్‌ ప్రత్యర్థికి తమ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ పేరుండడం వల్ల ఎన్నికల సమయంలో ఓటర్లు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్‌ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనివల్ల ఎన్నికల ఫలితాలూ ప్రభావితం అయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొంటున్నాయి. 
 
ఇక కేరళలో రెండు దశల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబరు 9, 11 తేదీల్లో పోలింగ్‌ నిర్వహించనున్నారు. 13న ఫలితాలు వెలువడనున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజ్ భవన్‌ను లోక్ భవన్‌గా పేరు మార్చాలి.. తెలంగాణ గ్రీన్ సిగ్నల్