టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుపై బీజేపీ ఫైర్ అయ్యింది. ఈ ఘటనను బీజేపీ తీవ్రంగా ఖండించింది. చంద్రబాబు అరెస్ట్‌పై బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ స్పందించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ అరెస్ట్‌లో పోలీసులు వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యానికే అవమానకరమని పేర్కొన్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, విచారణ చేయకుండా, నోటీసులు లేకుండా ఒక విపక్ష నాయకుడ్ని అరెస్ట్ చేయడం కేవలం కక్ష సాధింపు మాత్రమేనని అభిప్రాయపడ్డారు.
గతంలో జగన్‌ను అరెస్ట్ చేసే ముందు ఆయనను అనేక పర్యాయాలు విచారించి, నోటీసులు ఇచ్చిన తర్వాతే అరెస్ట్ చేశారని సీఎం రమేశ్ గుర్తు చేశారు. అలాగే చంద్రబాబు అరెస్ట్‌ను ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఖండించారు. ఈ మేరకు తన ట్విట్టర్‌లో చంద్రబాబును అరెస్ట్ చేయడం జరిగిందని... సరైన నోటీసు ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్‌లో పేరు పెట్టకుండా, వివరణ తీసుకోకుండా, ప్రొసీజర్ ఫాలో కాకుండా ఆయనను అరెస్ట్ చేయడం సమర్థనీయం కాదని చెప్పారు.
మరోవైపు రాష్ట్రంలో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. టీడీపీ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్‌లు చేశారు. ఎవరినీ ఇళ్ల నుంచి బయటకు రానివ్వడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి.