Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పోలవరం ప్రాజెక్టు.. యాక్షన్ ప్లాన్ అమలుకు అంతా సిద్ధం.. 2021 టార్గెట్

Advertiesment
AP CM
, శుక్రవారం, 28 ఫిబ్రవరి 2020 (12:28 IST)
ఏపీ సీఎం హోదాలో వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి రెండోసారి పోలవరం ప్రాజెక్టును ఏరియల్‌ సర్వే ద్వారా సందర్శించి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తిచేయడానికి ప్రభుత్వం రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక(యాక్షన్‌ ప్లాన్‌) అమలును క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
 
ఇంకా గడువులోగా పూర్తి చేయాడానికి తీసుకోవాల్సిన చర్యలపై జలవనరుల శాఖ అధికారులు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులకు మార్గనిర్దేశం చేయడానికి సీఎం వైఎస్‌ జగన్‌ ప్రాజెక్టుల బాట పట్టారు. ఇందులో భాగంగా ప్రాజెక్టు పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించనున్నారు. 
 
అంతకుముందు పోలవరం ప్రాజెక్టుకు వద్దకు చేరుకున్న సీఎం జగన్‌కు హెలిప్యాడ్‌ వద్ద మంత్రులు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, పేర్ని నాని, అనిల్‌కుమార్‌ యాదవ్‌, ఆళ్ల నాని, తానేటి వనిత, చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, కొట్టు సత్యనారాయణ, తల్లారి వెంకట్రావు, దేవులపల్లి ధనలక్ష్మి, జీఎస్ నాయుడు, కలెక్టర్‌ ముత్యాల రాజు స్వాగతం పలికారు.
 
ఈ నేపథ్యంలో 2021 చివరి నాటికల్లా ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడంతో... పనుల వేగవంతానికి దిశానిర్దేశం చేయనున్నారు. పనులు జరుగుతున్న తీరు, నిర్వాసితుల పునరావాసంపై ఉన్నతస్థాయి సమీక్షిస్తారు. ముఖ్యంగా పరిహారం, పనుల వేగవంతంగా అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇక, ఈ సమావేశంలోనే నిర్వాసితులకు కల్పించే పునరావాసంపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంటర్మీడియట్ విద్యార్థిని ఆత్మహత్య, 3 పేజీల సూసైడ్ లేఖ