Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆడవాళ్లపై మహీంద్రా గ్రూప్ చైర్మన్ ట్వీట్... నెట్‌లో వైరల్

ఆడవాళ్లపై మహీంద్రా గ్రూప్ చైర్మన్ ట్వీట్... నెట్‌లో వైరల్
, శుక్రవారం, 8 ఫిబ్రవరి 2019 (17:02 IST)
ఫోటో కర్టెసీ - సోషల్ మీడియా
కొంతమంది ప్రముఖులు మహిళల వస్త్రధారణపై మాత్రమే దృష్టి పెట్టి వివిధ వ్యాఖ్యలు చేస్తున్న తరుణంలో మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఆడవారిని ఉద్దేశించి పెట్టిన ట్వీట్‌కు భారీ స్పందన వస్తోంది. అప్పుడప్పుడూ తన ట్వీట్‌లతో ఆకట్టుకునే మహీంద్రా ఆడవారి గురించి, అందునా వర్కింగ్ లేడీస్ గురించి పెట్టిన ట్వీట్‌కు ఫిదా అయిపోతున్నారు మహిళలు. ఈ సందర్భంగా ఆయన్ షేర్ చేసిన కార్టూన్ ప్రాధాన్యత సంతరించుకుంది.
 
గత వారం రోజులుగా ఏడాది వయస్సు ఉన్న నా మనవడి ఆలన పాలన నేను చూసుకుంటున్నాను. ఆడవాళ్లు పడే శ్రమ నాకు అర్థమైంది. మగవారు కేవలం ఉద్యోగం చేస్తే సరిపోతుంది, కానీ ఆడవారు ఒకవైపు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ, మరోవైపు ఇంటిని చక్కదిద్దడం రెండింటినీ చాలా బ్యాలెన్స్డ్‌గా నిర్వహిస్తున్న మహిళలకు నేను సెల్యూట్ చేస్తున్నాను అంటూ ట్వీట్ చేసారు. 
 
ఈ ట్వీట్‌కు మహిళలు ఇకనైనా పురుషులు మాకు సహకరిస్తారని ఆశిస్తున్నామంటూ రిప్లై పెడుతుంటే, మగవారు అంత కంటే ఎక్కువ బాధ్యతలు మోస్తున్నారని కొంత మంది ప్రతిస్పందిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ కత్తి మధులిక పుర్రెను చీల్చి మెదడుని తాకింది... విషమంగానే... ఉన్మాదికి 14 రోజులు...