Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బైడెన్ జోరు... ట్రంప్ వెనుకంజ... అధినేతను నిర్ణయించే రాష్ట్రాలు ఏవి?

Advertiesment
బైడెన్ జోరు... ట్రంప్ వెనుకంజ... అధినేతను నిర్ణయించే రాష్ట్రాలు ఏవి?
, బుధవారం, 4 నవంబరు 2020 (09:06 IST)
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం నుంచి ప్రారంభమైంది. ఈ ఓట్ల లెక్కింపులో డెమొక్రటిక్ అభ్య‌ర్థి జో బైడెన్ జోరు కొనసాగుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు వెలువడిన ఫ‌లితాల్లో బైడెన్ 131 ఎల‌క్టోర‌ల్ ఓట్లు సాధించ‌గా, ప్ర‌స్తుత అధ్య‌క్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌కు కేవలం 108 ఎల‌క్టోర‌ల్ ఓట్లు మాత్రమే వచ్చాయి. 
 
ఇద్ద‌రు చెరో 11 రాష్ట్రాల్లో విజ‌యం సాధించిన‌ప్ప‌టికీ, ఎల‌క్టోర‌ల్ ఓట్ల ప‌రంగా బైడెన్ ముందంజ‌లో ఉన్నారు. బైడెన్ ఇప్ప‌టికే క‌నెక్టిక‌ట్ (7 ఎల‌క్టోర‌ల్ ఓట్లు), డెల‌వ‌ర్ (3), కొలంబియా (3), ఇల్లినాయిస్ (20), మేరీల్యాండ్ (10), మ‌సాచూసెట్స్ (11), న్యూజెర్సీ (14), న్యూయార్క్ (29), రోడే ల్యాండ్ (4), వెర్మాంట్ (3), వ‌ర్జీనియా (13) రాష్ట్రాల్లో విజ‌యం సాధించారు. 
 
అలాగే, డోనాల్డ్ ట్రంప్ కెంట‌కీ (8), ఇండియానా (11), ఓక్ల‌హామా (7), వెస్ట్ వ‌ర్జీనియా (5), టెన్నెస్సీ (11), సౌత్ డ‌కోటా (3), నార్త్ డ‌కోటా (3), అల‌బామా (9), అర్క‌న్సాస్ (6), లూసియానా (8), మిస్సిసీపీ (6), వ్యోమింగ్ (3) రాష్ట్రాల్లో ట్రంప్ విజ‌యం సాధించారు. 
 
ఇకపోతే, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో శ్వేతసౌథాధినేతను నిర్ణ‌యించ‌డంలో 12 రాష్ట్రాలు కీలక పాత్ర పోషించనున్నాయి. ఆ 12 రాష్ట్రాల్లో ఎక్కువ ఓట్లు సాధించిన‌వారే అధ్య‌క్ష అధికార నివాస‌మైన శ్వేత సౌథంలోకి అడుగుపెట్ట‌నున్నారు. దేశంలోని మొత్తం 50 రాష్ట్రాల్లో 538 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. ఇందులో 270 ఎల‌క్టోర‌ల్ ఓట్లు గెలుచుకున్నవారు అధ్య‌క్షప‌ద‌విని సొంతం చేసుకోనున్నారు. 
 
ఇందులో ఫ్లోరిడా, జార్జియా, నార్త్ క‌రోలినా, న్యూహాంప్‌షైర్‌, ఓహియో, మిచిగాన్‌, పెన్సిల్వేనియా, టెక్సాస్‌, వాషింగ్ట‌న్, మిన్నెసోటా, ఆరిజోనా, నెవాడా, లోవా రాష్ట్రాలు ప్ర‌ధాన‌మైన‌వి. ఇందులో అత్య‌ధికంగా టెక్సాస్‌లో 38 ఎల‌క్టోర‌ల్ ఓట్లు ఉండ‌గా, ఫ్లోరిడాలో 29, పెన్సిల్వేనియాలో 20, ఓహియోలో 18, జార్జియా 16, మిచిగాన్‌లో 16, నార్త్ క‌రోలినాలో 15, వాషింగ్ట‌న్‌లో 10, మిన్నెసొటాలో 10, ఆరిజోనాలో 11 చొప్పున ఎల‌క్టోర‌ల్ ఓట్లు ఉన్నాయి. ఈ 12 రాష్ట్రాల్లో ఎక్క‌ువ ఓట్లు గెలుచుకున్న‌వారు అధ్య‌క్ష రేసులో ముందుండే అవ‌కాశం ఉన్న‌ది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మరో మూడు రోజులు వర్షాలు