Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహిళా సాధికారతపై తీసిన నేనెక్కడున్నా ట్రైలర్ విడుదల చేసిన ఈటల రాజేందర్

Advertiesment
Etala Rajender

దేవి

, శనివారం, 15 ఫిబ్రవరి 2025 (16:44 IST)
Etala Rajender
బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి కుమారుడు మిమో చక్రవర్తి, ఎయిర్ టెల్ ఫేం సశా చెత్రి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'నేనెక్కడున్నా'. కేబీఆర్ సమర్పణలో మారుతి శ్యాం ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో మాధవ్ కోదాడ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఫిబ్రవరి 28న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 
 
ఈ సందర్భంగా  ప్రముఖ ప్రజా నాయకుడు, మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ చేతుల మీదుగా 'నేనెక్కడున్నా' ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ విడుదల అనంతరం ఈటల రాజేందర్ మాట్లాడుతూ... "జర్నలిజం విలువలు, మహిళా సాధికారతపై తీసిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలి. దర్శకుడు మాధవ్ కోదాడ, నిర్మాతలు కె.బి.ఆర్, మారుతి శ్యామ్ ప్రసాద్ రెడ్డికి నా శుభాకాంక్షలు" అని అన్నారు
 
'నేనెక్కడున్నా' సినిమాలో ఆనంద్ పాత్రలో మిమో చక్రవర్తి, ఝాన్సీగా సశా చెత్రి నటించారు. వాళ్లిద్దరూ జర్నలిస్ట్ రోల్స్ చేశారు. జీతం కోసం కాకుండా జనాల జీవితాల కోసం పాత్రికేయ రంగాన్ని ఎంచుకున్న ఆనంద్, ఝాన్సీ చేసిన కొన్ని స్టింగ్ ఆపరేషన్స్ వల్ల అవినీతిపరుల భాగోతాలు బయట పడతాయి. ఆ తర్వాత ఏమైంది? ఎన్ని ప్రమాదాలు ఎదుర్కొన్నారు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. 
 
మురళీ శర్మ, మహేష్ మంజ్రేకర్, ప్రదీప్ రావత్, షాయాజీ షిండే, అభిమన్యు సింగ్, రాహుల్ దేవ్, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణమురళి, సీవీఎల్ నరసింహారావు, రవి కాలే, భాను చందర్, రమణ చల్కపల్లి, మిలింద్ గునాజి, మిహిర, ఉత్తర, అర్చన గౌతం తదితరులు నటించిన ఈ సినిమాకు డాన్స్: ప్రేమ్ రక్షిత్ , లిరిక్స్ : సుద్దాల అశోక్ తేజ, సంగీతం : శేఖర్ చంద్ర , ఫోటోగ్రఫీ : జయపాల్ నిమ్మల, ఎడిటింగ్: ఫిల్మీ గ్యాంగ్ స్టర్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్: రాజేష్ S.S , సమర్పణ: కె.బి.ఆర్, నిర్మాత: మారుతి శ్యాం ప్రసాద్ రెడ్డి, స్టోరీ - స్క్రీన్ ప్లే - డైలాగ్స్ - డైరెక్షన్: మాధవ్ కోదాడ.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జాబిలమ్మ నీకు అంతా కోపమా సినిమాని సపోర్ట్ చేయండి : జాన్వీ నారంగ్