Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హార్రర్‌లో సందేశం 'లీసా'

Advertiesment
హార్రర్‌లో సందేశం 'లీసా'
, శనివారం, 25 మే 2019 (08:02 IST)
నటీనటులు : అంజలి, యోగి బాబు, మైమ్‌ గోపి తదితరులు
సాంకేతికత: సినిమాటోగ్రఫర్‌ : పి జి ముత్తయ్య, సంగీతం : సంతోష్‌ దయానిధి, నిర్మాత : సురేష్‌ కొండేటి, దర్శకత్వం : రాజు విశ్వనాథ్‌.
 
హీరోయిన్‌ అంజలి చాలా కాలం తర్వాత తెలుగులో 'లీసా'తో వచ్చింది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన హారర్‌ థ్రిల్లర్‌ ఇది. తెలుగు, తమిళ భాషల్లో త్రీడి టెక్నాలజీతో తెరకెక్కిన ఈ చిత్రానికి రాజు విశ్వనాథ్‌ దర్శకత్వం వహించారు. హారర్‌ చిత్రాలు 2డిలో కంటే 3డిలో చూడ్డం చిత్రమైన అనుభూతికి గురిచేస్తుంది. ఇదే అభిప్రాయాన్ని తెలుగు నిర్మాత సురేష్‌ వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకుందాం.
 
కథ :
లిసా (అంజలి) తండ్రిని చిన్నప్పుడే కోల్పోయి తన తల్లితో ఒంటరిగా ఉంటుంది. లిసాకు ఓ బాయ్‌ఫ్రెండ్‌ వుంటాడు. అతన్నే పెండ్లిచేసుకుంటానని తల్లితో ఒప్పిస్తుంది. ఆ తర్వాత తను యు.ఎస్‌. వెళ్ళడానికి నిశ్చయించుకుంటుంది. మరి తల్లి ఒంటరి అయిపోతుందని ఆమెకు పెల్లి చేయాలని లిసా భావిస్తుంది. కానీ తల్లి ప్రేమ వివాహం వద్దనీ లిసాకు చెబుతూ... అందుకు తన జీవితమే కారణమనీ, అమ్మమ్మ, తాతయ్యలు అందుకు ఒప్పుకోకపోవడమేనని వివరిస్తుంది. ఎలాగైనా వారిని కలిసి తాను ఒప్పిస్తానని అమ్మమ్మ, తాతయ్యలు వుండే కేరళలోని ఓ ప్రాంతానికి లిసా వెళుతుంది. అక్కడ వున్న ఇంట్లో వున్న వారిని అమ్మమ్మ, తాతయ్యగా భావించి అన్ని విషయాలు వారితో పంచుకుంటుంది. కానీ క్రమేణా వారి ప్రవర్తనపై అనుమానం రావడంతో వారు ఈమెను చంపడానికి ప్రయత్నిస్తారు. ఆ తర్వాత ఏమయింది? అసలు అమ్మమ్మ తాతయ్యలు ఏమయ్యారు? అనేది మిగిలిన సినిమా.
 
విశ్లేషణ:
రొటీన్‌ హర్రర్‌ చిత్రాలకంటే భిన్నమైన కాన్సెప్ట్‌తోపాటు ఇందులో 3డి టెక్నాలజీతో రావడం లీసా ప్రత్యేకత. ముఖ్యంగా టెక్నాలజీ ఉపయోగించి భయపెట్టించే పనిచేశారు. కొన్ని హారర్‌ ఎఫెక్ట్స్‌ బాగుండటం, అలాగే క్లైమాక్స్‌లో సెంటిమెంట్‌ హైలైట్‌ అవ్వడం వంటి అంశాలు లిసాకి ప్లస్‌ పాయింట్స్‌గా నిలుస్తాయి. హార్రర్‌ చిత్రంలోనూ ఏదో ఒక సెంటిమెంట్‌ వున్నట్లే ఇందులోనూ తల్లిదండ్రుల్ని చూడని కొడుకులకు ఎలా శిక్షించాలనేది ఇందులో చూపిస్తాడు. ఆ ట్రీట్‌మెంట్‌ సత్యదూరంగా వున్న తన బాణీలో శిక్షించడం కరెక్టే అనేకోణంలో తాతయ్య పాత్రధారి ద్వారా దర్శకుడు చెప్పాడు. ఇంటర్వెల్‌ ముందు సీన్లు బాగున్నాయి.
 
నటనాపరంగా అంజలి నటనే చిత్రానికి ఆకర్షణగా నిలిచింది. చాలా ఈజ్‌తో చేసేసింది. ఆమెకు తోడుగా వుండే ఆమె జూనియర్‌ పాత్రదారి కూడా మెప్పించాడు. ఎంటర్‌టైన్‌మెంట్‌ పరంగా మైమ్‌గోపీతోపాటు బ్రహ్మానందం, బజర్‌దస్త్‌లో నటించిన పాత్రలు నవ్విస్తాయి. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకి న్యాయం చేస్తూ నవ్వించే ప్రయత్నం చేసారు.
 
అయితే హార్రర్‌ చిత్రాలంటే ఆద్యంతం ఉత్కంఠను కల్గించే సన్నివేశాలుంటే ఇంకాస్త ఎట్రాక్ట్‌గా వుండేది. దర్శకుడు హర్రర్‌ అండ్‌ కామెడీ సన్నివేశాలతో ఇంకా జాగ్రత్త చేస్తే మరింతగా ఆకట్టుకునేది. భయపెట్టే సినిమాల్లో వచ్చే కొన్ని సన్నివేశాలు పిల్లల్నికూడా ఎంటర్‌టైన్‌ చేసేలా వున్నాయి. ఇలాంటి చిత్రాల్లో కాస్త లాజిక్కు అందదుకానీ మరింత జాగ్రత్తపడాల్సింది. 
 
మొదటిభాగం సరదాగా సాగుతుంది. సెకండాఫ్‌ మొదలైన 15 నిమిషాల తర్వాత గాని ఆడియన్‌ అసలు కథలోకి వెళ్ళడు. దీనికి తోడు తమిళ్‌ నేటివిటీ సినిమాలో స్పష్టంగా కనిపిస్తోంది. టెక్నికల్‌రంగంలో దర్శకుడు రాజు విశ్వనాథ్‌ తీసుకున్న థీమ్‌ చాలా బాగుంది. తల్లిదండ్రుల్ని పిల్లలు గౌరవించాలనేది మంచి పాయింట్‌. దాన్ని హార్రర్‌ వేలో చూపించాడు. సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలిచింది. గ్రాఫిక్స్‌ కూడా బాగానే ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ బాగుంది. ఎడిటింగ్‌ ఫస్ట్‌ హాఫ్‌ పరంగా కొంచెం స్లోగా సాగిన, సెకెండ్‌ హాఫ్‌ను కట్‌ చేసిన విధానం బాగుంది. 
 
అలాగే నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. కానీ అక్కడక్కడా కథనంలో ఆసక్తి కరంగా సాగక పోవడం, సినిమాలో కథకు అనవసరమైన పండని కామెడీ సీన్స్‌ ఎక్కువుగా ఉండటం.. అన్నిటికి మించి సినిమా స్లోగా సాగుతూండడం కన్పిస్తుంది. హార్రర్‌ కంటెంట్‌లు నచ్చే ప్రేక్షకులు ఈ చిత్రం నచ్చుతుంది. మరి ఇలాంటి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారనేది చూడాలి.
 
రేటింగ్‌..3/5

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమాయకపు రాముడుని ఆటాడుకునే "సీత"