Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

"ఉప్పెనంత ప్రేమ"కు ధన్యవాదాలు... రూ.100 కోట్ల క్లబ్‌లోకి...

, ఆదివారం, 7 మార్చి 2021 (08:33 IST)
మెగా ఫ్యామిలీ హీరో వైష్ణవ్ తేజ్ నటించిన తొలి చిత్రం "ఉప్పెన". బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించగా, కృతిశెట్టి హీరోయిన్. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలు సంయుక్తంగా నిర్మించగా, ఇటీవల విడుదలైన ఈ మూవీ సూపర్ డూపర్ హిట్‌ను సొంతం చేసుకుంది. 
 
ఫిబ్రవరి 12న వరల్డ్ వైడ్‌గా అత్యధిక థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ రాబట్టుకొని యునానిమస్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇక కలెక్షన్ల విషయానికొస్తే సరికొత్త రికార్డులు సృష్టిస్తూ.. ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. ఈ చిత్రం వందకోట్ల క్లబ్‌లో చేరినట్లుగా స్వయంగా నిర్మాతలే తాజాగా ఓ పోస్టర్‌ను విడుదల చేశారు.  
 
వాస్తవానికి ఈ మూవీ విడుదలకు ముందు జరిగిన ఓ ఈవెంట్‌లో క్రియేటివ్‌ దర్శకుడు సుకుమార్‌.. ఈ చిత్రం రూ.100 కోట్ల చిత్రమని ప్రకటించారు. ఆయన మాటలను నిజం చేస్తూ.. ఈ చిత్రం 100 కోట్ల రూపాయల గ్రాస్‌ కలెక్షన్లను సాధించినట్లుగా చిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. 
 
ఒక డెబ్యూ హీరోతో రూ.100 కోట్ల కలెక్షన్స్‌ రాబట్టడమంటే మాములు విషయం కాదు. ఈ చిత్రానికి అన్నీ అలా కలిసి వచ్చాయి. కథ, కథనం, హీరో, విలన్‌, హీరోయిన్‌, నిర్మాతలు, దర్శకుడు.. ఇలా ఒక్కటేమిటి.. ప్రతీది ఈ చిత్రానికి ప్లస్‌ పాయింట్సే అయ్యాయి. 
 
అందుకే ఈ చిత్రం ఓ మైలురాయిగా నిలిచిపోతుందని మెగాస్టార్‌ కూడా అన్నారు. ప్రస్తుతం చిత్రయూనిట్‌ వదిలిన రూ100 కోట్ల పోస్టర్‌ సోషల్‌ మీడియాలో సెన్సేషన్‌ని క్రియేట్‌ చేస్తోంది. మెత్తంమీద మెగా మేనల్లుడి డెబ్యూ అదిరిపోయింది.


 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అదంతా ఉత్తుత్తి ప్రచారమే : అనుపమ పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన తల్లి!