భారత క్రికెట్ జట్టు క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా, సినిమా హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్‌లకు పెళ్లి జరుగనుందనే వార్త ఇపుడు సోషళ్ మీడియాలో వైరల్ అయింది. గత కొంతకాలంగా ప్రేమలో మునిగితేలుతున్న వీరిద్దరూ.. త్వరలోనే ఓ ఇంటివారు కాబోతున్నారనే ప్రచారం సాగుతోంది. దీనిపై అనుపమా పరమేశ్వరన్ తల్లి స్పందించారు.
తాజాగా మీడియాతో మాట్లాడిన ఆమె వారిద్దరూ ప్రేమలో ఉన్నారనేది పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. అయితే అనుపమ తండ్రి క్రికెట్‌కు వీరాభిమాని అని, అందుకే ఒక సందర్భంలో బుమ్రాను కలుసుకున్నారే తప్ప అందులో మరే ఉద్దేశమూ లేదని స్పష్టతనిచ్చారు. ఆ సమయంలో షూటింగ్ కోసం బుమ్రా ఉన్న హోటల్లోనే అనుపమ బస చేయాల్సి రావడంతో ఈ ఊహాగానాలు పుట్టుకొచ్చాయి.
ఈ ఊహాగానాలను తమ కుటుంబం అంత సీరియస్‌గా తీసుకోవట్లేదని అనుపమ తల్లి తెలిపారు. ఇంగ్లండ్‌తో చివరి టెస్ట్ మ్యాచ్ నుంచి బుమ్రా తప్పుకోవడంతో సోషల్ మీడియాలో ఈ పెళ్లి వదంతులు మొదలయ్యాయి. మొత్తానికి అనుపమ విషయంలో ఆమె తల్లి పూర్తి స్పష్టతచ్చింది.
మరోవైపు బుమ్రాతో స్టార్ స్పోర్ట్స్ యాంకర్ సంజన గణేశన్ ఏడడుగులు వేయబోతుందని మరో ప్రచారం మొదలైంది. ఈ వార్తలోనైనా నిజం ఉందా? లేదా? అని నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.