Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పడుకునైనా డబ్బులు తీసుకురా.. అలనాటి నటికి ఎంత కష్టమొచ్చింది?

Advertiesment
TV Serial and Movie Actress
, బుధవారం, 29 జనవరి 2020 (20:14 IST)
బుల్లితెరపై ఎన్నో సీరియల్స్‌లో నటించిన నటి రాగిణికి సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయి. అలా తన కెరీర్‌ను సాగిస్తోంది. అందులో తన వ్యక్తిగత విషయాలను చెబుతూ తీవ్రంగా కన్నీంటి పర్యాంతమైంది.  
 
తన చిన్నతనంలోనే తండ్రికి పక్షవాతం రావడంతో డాన్స్ ప్రదర్శనలు ఇస్తూ ఇంటి ఖర్చు చూసుకునేదాన్ని అంటూ తను పడ్డ కష్టాల గురించి చెప్పింది రాగిణి. తనకు పన్నెండేళ్ల వయసులోనే పెళ్లైందని, ఆ సమయంలోనే బాబు కూడా పుట్టాడని చెబుతూ తన భర్తకి  యాక్టింగ్ ఫీల్డ్ అంటే అనుమానమని, బాగా హింసించేవాడని తెలిపింది. 
 
పెళ్ళైన ఆరు నెలల నుండే భర్త హింసించడం మొదలుపెట్టాడని, తప్పుడు దారుల్లో తిరిగి సంపాదించమని వేధించాడని చెప్పుకొచ్చింది. ఎవడితోనైనా పడుకునైనా సంపాదించుకురా అంటూ బలవంతం చేసేవాడని గుర్తు చేసుకున్నారు. అలాంటి తప్పుడు పనులు చేయడం ఇష్టం లేదని చెప్పినా వినేవాడు కాదని, ఆ బాధలు భరించలేక అతడి నుండి పెళ్లైన ఏడాదికే విడిపోయినట్లు తెలిపింది.
 
ఆ సమయంలో పెళ్లి ఫొటోలన్నీ తగలబెట్టేసి వెళ్లిపోయాడని, అప్పటి నుండి తన కొడుకుతోనే జీవించినట్లు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తన కొడుకు జర్మనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నట్లు అతనే తనను బాగా చూసుకుంటున్నట్లు కన్నీంటి పర్యంతమవుతూ చెప్పింది రాగిణి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#JaanuTrailer వచ్చేసింది.. ఆర్ యు వర్జీన్.. ఛీ ఏం మాట్లాడుతున్నావ్ జాను.. (video)