Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తమిళ్ లో అదరగొడుతోన్న శింబు కొత్త సినిమా పాతు తల

Advertiesment
Simbu, Pathu Thala team
, శనివారం, 1 ఏప్రియల్ 2023 (19:16 IST)
Simbu, Pathu Thala team
క్రేజీ స్టార్ శింబు హీరోగా నటించిన సినిమా పాతు తల. ఒబెలి ఎన్ కృష్ణ డైరెక్ట్ చేసిన సినిమా ఇది.రీసెంట్ గా మార్చ్ ౩౦న రిలీజ్ అయిన ఈ చిత్రం శింబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చుకుంది. 2017లో కన్నడలో సూపర్ హిట్ అయినా మఫ్టీ చిత్రానికి రీమేక్ గా వచ్చిందీ చిత్రం. శింబు గెట్ అప్ తో పాటు నటనకు అద్భుతమైన ప్రశంసలు వస్తున్నాయి. ఏ జి రావణన్ అనే గ్యాంగ్ స్టర్ పాత్రలో నటించాడు శింబు. మామూలుగా శింబు సినిమాలంటే తమిళనాట ఫ్యాన్ షోస్ ఉంటాయి. బట్ ఈ చిత్రానికి ఫ్యాన్ షోస్ లేకపోయినా.. వర్కింగ్ డే అయినా.. రెగ్యులర్ రేట్స్ తోనే అతని కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చుకుంది ఈ మూవీ. మొదటి రోజు 12.03 కోట్ల వసూళ్లు సాధించి సత్తా చాటింది. దీంతో ఇది కేవలం శింబు చరిష్మా తోనే సాధ్యం అయింది అంటూ కోలీవుడ్ లో చెప్పుకుంటున్నారు. 
 
రీమేక్ మూవీ అయినా తమిళ్ తో పాటు జనరల్ ఆడియెన్సుస్ కు కూడా కనెక్ట్ అయ్యేలా రూపొందించాడు దర్శకుడు బెలి ఎన్ కృష్ణ. అందుకు తగ్గట్టుగానే అద్భుతమైన రివ్యూస్ కూడా రావడంతో రెండో రోజు ఏకంగా 14 కోట్లు వసూలు చేసి బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది పాతు తలా మూవీ. శింబు తో పాటు గౌతమ్ కార్తీక్, ప్రియా భవాని శంకర్, అనుసితారా, గౌతమ్ మీనన్ ఇతర కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం మరో హైలెట్ గా నిలిచింది.
 
మొత్తంగా శింబుకు ఇది హ్యాట్రిక్ విజయం. అంతకు ముందు టైం ట్రావెల్ కాన్సెప్ట్ వచ్చిన మనాడు చిత్రం తో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నాడు. తర్వాత వెందు తానిందతు కాడుతో మరో హిట్ పడింది. ఇక ఇప్పుడు గ్యాంగ్ స్టర్ గా బ్లాక్ బస్టర్ అందుకున్నాడు శింబు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓటీటీలోకి అమిగోస్ వచ్చేసింది... నెట్‌ఫ్లిక్స్‌లో ఎయిర్‌టెల్ సేవలతో ఫ్రీ