Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి.. జూ.ఎన్టీఆర్ షాక్

Advertiesment
saif alikhan

ఠాగూర్

, గురువారం, 16 జనవరి 2025 (10:33 IST)
బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌పై గుర్తుతెలియని దుండగుడు దాడికి పాల్పడ్డాడు. ముంబై మహానగరంలోని అతని నివాసంలోనే ఈ దాడి జరిగింది. కత్తితో ఆయనపై దాడి చేయడంతో ఆయనకు గాయాలయ్యాయి. దీంతో సైఫ్ అలీఖాన్‌ను ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు. 
 
గురువారం తెల్లవారుజామున 2.30 గంటలకు దాడి ఘటన చోటుచేసుకుంది. సైఫ్, అతడి కుటుంబసభ్యులు నిద్రలో ఉండగా.. ఇంట్లోకి చొరబడిన దుండగుడు దొంగతనానికి యత్నించాడు. అతడిని గమనించిన సైఫ్‌ అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. దాడి చేసి పరారైనట్లు తెలుస్తోంది. 
 
దొంగతో జరిగిన ఘర్షణలో నటుడికి ఆరుచోట్ల కత్తి గాయాలయ్యాయి. రెండుచోట్ల లోతుగా గాయమైనట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం సైఫ్‌కు శస్త్ర చికిత్స జరుగుతోంది. ఈవిషయంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు.
 
మరోవైపు, ఈ దాడి ఘటనను అనేక మంది సినీ ప్రముఖులు ఖండిస్తున్నారు దీనిపై నటుడు ఎన్టీఆర్‌ స్పందించారు. విషయం తెలిసి తాను షాకయ్యానని అన్నారు. ‘‘సైఫ్‌ సర్‌పై దాడి గురించి తెలిసి షాకయ్యా. ఇది నిజంగా బాధాకరం. ఆయన త్వరితగతిన కోలుకోవాలని ఆరోగ్యంగా తిరిగిరావాలని కోరుకుంటున్నా’’ అని పేర్కొన్నారు. మరోవైపు అభిమానులు సైఫ్‌ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ పోస్టులు పెడుతున్నారు.
 
మరోవైపు ఈ దాడిపై సైఫ్‌ సతీమణి కరీనాకపూర్‌ టీమ్‌ ప్రకటన విడుదల చేసింది. ‘‘గత రాత్రి సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ నివాసంలో చోరీకి యత్నం జరిగింది. సైఫ్ చేతికి గాయం కావడంతో ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మిగిలిన కుటుంబ సభ్యులంతా క్షేమంగా ఉన్నారు. ఈ క్లిష్ట సమయంలో మీడియా, అభిమానులు సంయమనంతో వ్యవహరించాలని కోరుకుంటున్నాం. ఎలాంటి వదంతులు వ్యాప్తి చేయొద్దు. పోలీసులు ఇప్పటికే దర్యాప్తు మొదలుపెట్టారు’’ అని పేర్కొంది. 
 
గతేడాది విడుదలైన ‘దేవర’ కోసం ఎన్టీఆర్‌, సైఫ్‌ అలీఖాన్‌ కలిసి వర్క్‌ చేశారు. ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయం పోషించిన ఈ సినిమాలో సైఫ్‌ భైరవ అనే ప్రతినాయకుడి పాత్రలో నటించారు. సైఫ్‌ నటనకు సినీ ప్రియులు ఫిదా అయ్యారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దర్శకుడు శంకర్ సినిమాలు ఫెయిల్యూర్ కు కారణం ఆవిడేనా?