తమిళ దర్శకుడు శంకర్ సినిమాలంటే భారతీయుడు అంత క్రేజ్. ఒక్కో కథను ఒక్కోశైలిలో తనలోని అపచితుడును బయట పెట్టేవాడు. చూడ్డానికి జంటిల్ మెన్ గా కనిపిస్తూ తనలాంటివాడు ఒకే ఒక్కడు అంటూ నిరూపించుకున్నాడు. చిట్టిపొట్టి రోబో అంటూ టెక్నాలజీతో ఆటలాడేసుకున్నాడు. కానీ అలాంటి శంకర్ కు కొద్దికాలంగా భారతీయులు దూరం పెట్టారనిపిస్తుంది. తను తీసిన సినిమాకు సీక్వెల్ గా భారతీయుడు2 తీసినా అందులో సరైన పసలేదనీ, పాత కథను నేపథ్యంగా మార్చి తీయడంతో డిజాస్టర్ గా నిలిచింది.
ఇక ఆ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ అనే సినిమానుతీస్తున్నట్లు ప్రమోషన్ చేశారు. కరోనా టైంలో ప్రారంభించిన ఈ సినిమా ఆన్ లైన్ మోసాలు, హైటెక్ కథ అంటూ తొలుత ప్రచారం చేశారు. సూటుబూటు వేసుకున్న పోస్టర్లను రిలీజ్ చేశారు. ఆ తర్వాత కొంతకాలం షూటింగ్ జరిగినా మధ్యలో గేప్ వచ్చింది. ఫైనల్ గా సినిమా బయటకు వచ్చేసరికి పాతకాలపు కథతో పొలిటికల్ కథను తీసినట్లు అర్థమయిపోయింది. గత సినిమాలుచూసి కోట్ల మంది ఇన్స్పైర్ అయిన భారతీయులు ఈసారి రిజెక్ట్ చేసే స్థాయికి చేరుకున్నాడు దర్శకుడు. అందుకు శంకర్ సన్నిహితులు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు.
నా అభిమాన దర్శకుడు ఇలా ఫెయిల్యూర్ అవ్వడం నాకు చాలా బాధ కలిగించింది. కేవలం శంకర్ గారి సినిమాలు జెంటిల్ మెన్, భారతీయుడు, ఒకే ఒక్కడు, అపరిచితుడు లాంటి సినిమాలు చూసి కోట్ల మంది ఇన్స్పైర్ అయ్యారు. గత సినిమాలకు మంచి కథలను అందించిన సుజాత రంగరాజన్ (ప్రముఖ మేల్ రచయిత, నావలిస్ట్, స్క్రీన్ రైటర్) లేకపోవటమే డైరక్టర్ శంకర్ ఫెయిల్యూర్స్ కు కారణమా? అంటే నేను కచ్చితంగా ఒప్పుకుంటాను.శంకర్ గారు మంచి దర్శకుడు కానీ మంచి కథ తయారు చేసుకోలేడు అంటూ స్పందించారు.
ఇక గేమ్ ఛేంజర్ ప్రమోషన్ లో కూడా శంకర్ కూడా ఓ రచయిత, దర్శకుడు కథను నేను దర్శకత్వం వహించి గేమ్ ఛేంజర్ తీశానని చెప్పాడు. సో.. గొప్ప దర్శకులు ఎవరైనా సరే తన టీమ్ నుంచి విషయం వున్న వాడు వెళ్ళిపోతే ఆ తర్వాత ఫెయిల్యూర్ అయిన దర్శకులు చాలామంది సినీరంగంలో వున్నారు.