Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Pushpa 2 stampede మహిళ ప్రాణం తీసిన 'పుష్ప-2' మూవీ ప్రీమియర్ షో (Video)

Advertiesment
woman deadbody

ఠాగూర్

, గురువారం, 5 డిశెంబరు 2024 (07:03 IST)
Pushpa 2 stampede: Woman dead అల్లు అర్జున్ హీరోగా నటించిన 'పుష్ప-2' చిత్రం ఓ మహిళ ప్రాణం తీసింది. ఆమె కుమారుడు పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్ నగరంలోని సంద్య 70 ఎంఎం థియేటర్‌లో బుధవారం రాత్రి ఈ సినిమాకు సంబంధించి బెన్ఫిట్ షో వేశారు. దీన్ని చూసేందుకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ థియేటర్‌కు తరలి వచ్చారు. దీనికితోడు హీరో అల్లు అర్జున్ సైతం సినిమాను చూసేందుకు థియేటర్‌కు వచ్చారు. దీంతో థియేటర్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకోవడంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. ఈ తొక్కిసలాటలో దిల్‌సుఖ్ నగర్‌కు చెందిన రేవతి (39) అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. 
 
ఆమె తన భర్త భాస్కర్, ఇద్దరు పిల్లలు శ్రీతేజ్ (9), సన్వీక (7)తో కలిసి ఈ చిత్రం ప్రీమియర్ షో చూడటానికి ఆర్టీసీ రోడ్స్ లోని సంధ్య 70 ఎంఎం థియేటర్‌కు వచ్చారు. అదేసమయంలో అల్లు అర్జున్ సంధ్య థియేటర్‌కు వచ్చిన సమయంలో అభిమానులు థియేటర్ గేటు లోపలికి చొచ్చుకు వచ్చారు. ఈ సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి, ఆమె కొడుకు శ్రీ తేజలు పస్మారక స్థితిలోకి వెళ్లారు. 
 
వెంటనే పోలీసులు విద్య నగర్‌లోని దుర్గ భాయి దేశముఖ్ హాస్పిటల్‌‌కు తరలించారు. రేవతి అప్పటికే మృతి చెందగా, శ్రీతేజ పరిస్థితి విషమంగా ఉండటంతో బాలుడిని బేగంపేట కిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. రేవతి మృతదేహాన్ని దుర్గాబాయి దేశముఖ్ హాస్పిటల్ నుండి గాంధీ మార్చురీకి తరలించారు. దీంతో హీరో అల్లు అర్జున్‌తో సహా ఆ చిత్ర నిర్మాతలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Naga chaitanya Sobhita dhulipala Wedding నాగచైతన్య-శోభిత పెళ్లి