Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

త‌న కోరికకు నా మాట‌లు తోడ‌య్యాయి : రష్మి గౌతమ్

Advertiesment
Rashmi Gautam
, శుక్రవారం, 8 జనవరి 2021 (20:20 IST)
శుక్ర‌వారం హైద‌రాబాద్‌, కె.పి.హెచ్.బి కాలనీలో నటి జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ సందడి చేసింది. రష్మి గౌతమ్‌కి పర్సనల్  ఫ్యాషన్ డిజైనర్‌గా పనిచేస్తున్న డిజైనర్ దివ్య ఏర్పాటు చేసిన... త్రెడ్ అండ్ ఫ్యాబ్రిక్ డిజైనర్ స్టూడియోను రష్మీ గౌతమ్ ప్రారంభించింది.
 
ఈ సందర్భంగా రష్మీ గౌతమ్ మాట్లాడుతూ... దివ్య మంచి ఔట్ లుక్ డిజైన్స్ అందిస్తుంది. తను నాకెంతో ఇష్టమైన డిజైన్స్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఎంతో శ్రద్ద పెట్టి డెడికేషన్‌తో ఆదరిస్తున్నందున తన మనసులో ఉన్న కోరికకు నా మాటలు తోడు అవ్వడంతో ఈ వాకిన్ స్టోర్ ప్రారంభించడం జరిగింది.
 
అలాగే తను తయారు చేసే చాక్లెట్ నాకు ఎంతో నచ్చాయి. తను త్వరలో చాక్లెట్ స్టోర్ ప్రారంభిస్తానంటే నా సహకారం ఉంటుంది.కాబట్టి ఆమెను అందరూ ఆదరించాలని తను ఈ స్టూడియో తో పాటు సిటీ లో మరిన్ని బ్రాంచ్ లు ఓపెన్ చేస్తే వాటికి నేనె గెస్ట్ గా వస్తానని అన్నారు.
 
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ దివ్య మాట్లాడుతూ, రష్మి గౌతమ్ సహకారం మరిచిపోలేనిది. రెండు సంవత్సరాలు గా తను చేసే డీ,జబర్దస్త్ ప్రోగ్రామ్స్‌కు నేను ఫ్యాషన్ డిజైనర్‌సినిమా తొందరగా రిలీజ్ అయ్యి మంచి హిట్టు కొట్టాలి.
 
చాలామంది ఆన్‌లైన్‌లో ఫ్యాబ్రిక్స్ కొని మోసపోతున్నామని నా దృష్టికి తీసుకు రావడంతో నాకు ఫిజికల్ స్టోర్ పెట్టాలనే పట్టుదలతో స్టోర్ పెట్టడమే నా డ్రీమ్ అనుకున్నాను. నేను రెండు సంవత్సరాల నుంచి అనుకుంటున్న నా కోరిక ఈ లాక్డౌన్‌తో మరింత డిలే అయ్యింది. నేను అనుకున్న డ్రీమ్ ఈ రోజు కె.పి.హెచ్.బిలో నేను ఓపెన్ చేసిన థ్రెడ్ & ఫ్యాబ్రిక్స్ స్టూడియోతో తీరింది. 
 
రష్మీ గౌతమ్ వచ్చి నా స్టూడియో ప్రారంభించిన ఆమెకు నా ధన్యవాదాలు.అలాగే నేను తయారు చేసే హోమ్ మేడ్ చాక్ లెట్స్‌లలో మ్యారీ గోల్డ్ చాక్లెట్ తనకు ఎంతో ఇష్టం. కష్టపడే వారు అంటే రశ్మి గౌతమ్ కు ఏంతో ఇష్టం. అందుకే ఆమె సపోర్ట్‌తో  చాక్లెట్స్ స్టోర్ ఓపెన్ చేస్తాను. ఈ సారి సంక్రాంతి పండుగ తన సొంత ఊరు వైజాగ్‌లో జరుపుకుంటానని, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'మాస్టర్‌' అన్నీ వర్గాలను మెప్పించే ఫీస్ట్‌లా ఉంటుంది : డైరెక్టర్‌ లోకేశ్‌ కనకరాజ్‌