Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 24 April 2025
webdunia

గ్లామర్ బ్యూటీగా అవతారమెత్తిన చిన్నారి పెళ్లికూతురు! (Video)

Advertiesment
Heroine Avika Gor
, శుక్రవారం, 8 జనవరి 2021 (15:40 IST)
బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయమైన నటి అవికా గోర్. "ఉయ్యాలా జంపాలా" చిత్రంతో తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైంది. నిజానికి ఈ చిత్రం కంటే ముందుగా ఆమె బుల్లితెరపై ప్రసారమైన "చిన్నారి పెళ్లికూతురు" అనే సీరియల్ ద్వారా దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు పొందింది. 
 
ఆ ఆ తర్వాత పలు తెలుగు సినిమాల్లో నటించి మెప్పించింది. లాక్డౌన్ సమయంలో అవిక తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకుంది. బొద్దుగా ఉండే అవిక.. సన్నగా, నాజూగ్గా మారిపోయింది. పక్కింటమ్మాయి తరహాలో ఉండే అవిక గ్లామరస్ బ్యూటీ అవతారమెత్తింది. 
 
ఎప్పటికప్పుడు తన హాటో ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. తాజాగా తన బికినీ ఫొటోను అవిక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. బికినీ ధరించి స్విమ్మింగ్ పూల్ గట్టుపై పడుక్కున్న ఫొటోను అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
కాగా, గతంలో అవికా గోర్ టాలీవుడ్ యువ హీరో రాజ్‌తరుణ్‌తో ప్రేమలో పడినట్టు వార్తలు వచ్చాయి. వీటిపై వారిద్దరూ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఆ తర్వాత ఈ వార్తలన్నీ కేవలం పుకార్లేనని తేలిపోయింది. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కంగనాపై దేశ ద్రోహం కేసు : ఎందుకు చిత్రవధ చేస్తున్నారు?