Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'మాస్టర్‌' అన్నీ వర్గాలను మెప్పించే ఫీస్ట్‌లా ఉంటుంది : డైరెక్టర్‌ లోకేశ్‌ కనకరాజ్‌

'మాస్టర్‌' అన్నీ వర్గాలను మెప్పించే ఫీస్ట్‌లా ఉంటుంది : డైరెక్టర్‌ లోకేశ్‌ కనకరాజ్‌
, శుక్రవారం, 8 జనవరి 2021 (20:15 IST)
దళపతి విజయ్‌ కథానాయకుడిగా నగరం, ఖైది చిత్రాలతో సెన్సేషల్‌ హిట్స్‌ సాధించిన డైరెక్టర్‌ లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ఎక్స్‌బీ ఫిల్మ్‌ క్రియేటర్స్‌ బ్యానర్‌పై గ్జేవియర్‌ బ్రిట్టో నిర్మించారు. ఈ సినిమా తెలుగు హక్కులను ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్ అధినేత మహేశ్‌ కోనేరు దక్కించుకున్నారు. ఇంతకు ముందు హీరో విజయ్‌ చిత్రం 'విజిల్‌'ను తెలుగులో ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మహేశ్‌ కోనేరు విడుదల చేశారు. 'విజిల్‌' ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే కాంబినేషన్‌లో మాస్టర్‌ సినిమా  సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదలవుతుంది. ఈ సందర్భంగా 'మాస్టర్‌' బిగ్‌ సీడీని చిత్ర యూనిట్‌ విడుదల చేసింది.
 
శంతన్‌ భాగ్యరాజ్‌ మాట్లాడుతూ "నిర్మాత మహేశ్‌ కోనేరుగారికి అభినందనలు. తెలుగు సినిమాలో భారీ హిట్‌ కావాలని కోరుకుంటున్నాను. చిన్నా, పెద్ద సినిమాలని కాకుండా సినిమాను సెలబ్రేషన్‌లా చూసే తెలుగు ప్రేక్షకులంటే ఎంతో ఇష్టం. 'మాస్టర్‌' సినిమాలో నటించడం చాలా హ్యాపీగా ఉంది. విజయ్‌ అన్న.. విజయ్‌ సేతుపతి, మాళవికా, ఆండ్రియా.. ఇలా  భారీ తారాగణం ఈ సినిమాలో నటించారు. ఇంత మంచి సినిమాలో అవకాశం ఇచ్చిన లోకేశ్‌ కనకరాజ్‌గారికి థాంక్స్‌. తెలుగులో సినిమా చేయాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను" అన్నారు. 
 
అర్జున్‌ రాజ్‌ మాట్లాడుతూ, "ఖైది సినిమా తర్వాత లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో చేసిన సినిమా మాస్టర్‌. విజయ్‌గారు, విజయ్‌ సేతుపతిగారితో కలిసి నటించడం సంతోషంగా ఉంది" అన్నారు. 
 
అనిరుద్‌ రవిచంద్రన్‌ మాట్లాడుతూ, "మాస్టర్‌ సినిమాను మహేశ్‌ కోనేరుగారు భారీ ఎత్తున రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేశారు. ఈ సినిమా హిట్‌తో మహేశ్‌గారు సక్సెస్‌ను కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. నాకు అవకాశం ఇచ్చిన విజయ్‌గారికి థాంక్స్‌. డైరెక్టర్‌ లోకేశ్‌ నాకు సోదరుడితో సమానం. త్వరలోనే లోకేశ్‌ దర్శకత్వంలో సినిమాను తెలుగు ప్రేక్షకులు ఎంజాయ్‌ చేస్తారని భావిస్తున్నాను. అనంత్‌ శ్రీరామ్‌, కృష్ణకాంత్‌, సింగర్‌ శ్రీకృష్ణ, మాలిలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. సినిమాలో చాలా ప్రత్యేకతలున్నాయి. విజయ్‌ సార్‌గారి సినిమానే కాదు.. సినిమా చూసిన తర్వాత ఆలోచించేలా చేసే సినిమా ఇది. దర్శకుడు లోకేశ్‌ పర్‌ఫెక్ట్‌గా క్లాస్‌, మాస్‌ను మిక్స్‌ చేసి సినిమాను తెరకెక్కించాడు. అలాగే విజయ్‌ సేతుపతి, శంతన్‌, అర్జున్‌రాజ్‌, మాళవికా, ఆండ్రియా అందరూ మంచి తారాగణం సినిమాలో నటించారు. సినిమాను థియేటర్స్‌లో సెలబ్రేట్‌ చేసుకుంటానడంలో సందేహం లేదు" అన్నారు. 
 
ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్‌ అధినేత మహేశ్‌ కోనేరు మాట్లాడుతూ, "కోవిడ్‌ సమయంలో మనం ఎన్ని ఇబ్బందులు పడ్డామో మనకు తెలుసు. ఈ ఏడాది ఆ ఇబ్బందులన్నీ తొలగిపోవాలి. ఈ సంక్రాంతికి మా మాస్టర్‌ సినిమాతో పాటు క్రాక్‌, రెడ్‌, అల్లుడు అదుర్స్‌ సినిమాలు విడుదలవుతున్నాయి. ప్రతి సినిమా చాలా పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నాను. విజయ్‌గారి గత చిత్రం విజిల్‌ను తెలుగులో నేను విడుదల చేశాను. చాలా పెద్ద హిట్‌ అయ్యింది. మళ్లీ మాస్టర్‌ సినిమాను రిలీజ్‌ చేసే అవకాశం ఇచ్చిన విజయ్‌గారికి, నిర్మాతలు లలిత్‌గారికి, జగదీష్‌గారికి ధన్యవాదాలు. సినిమా అద్భుతంగా ఉంది. విజయ్‌గారి కెరీర్‌లోనే వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ మూవీ అవుతుంది. జనవరి 13న దాన్ని చూస్తాం" అన్నారు. 
 
డైరెక్టర్‌ లోకేశ్‌ కనకరాజ్‌ మాట్లాడుతూ, "మాస్టర్‌ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్న మహేశ్‌ కోనేరుగారికి అభినందనలు. సినిమా చాలా పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నాను. నా గత రెండు చిత్రాలను తెలుగు ప్రేక్షకులు అద్భుతంగా ఆదరించారు. ఇప్పుడు మాస్టర్‌ జనవరి 13న విడుదలవుతుంది. ఎప్పటిలాగానే ప్రేక్షకుల ఆశీర్వాదం ఉంటుందని భావిస్తున్నాను. సినిమా అన్ని వర్గాల వారికి ట్రీట్‌లా ఉంటుంది. విజయ్‌గారికి, విజయ్‌ సేతుపతిగారికి, బ్రిట్టో గారికి, జగదీష్‌గారికి, అనిరుద్‌ రవిచంద్రన్‌ సహా ఎంటైర్‌ యూనిట్‌కి స్పెషల్ థాంక్స్‌" అన్నారు. 
 
ఈ కార్యక్రమంలో పాటల రచయితలు, సింగర్స్‌ అనంత్‌ శ్రీరామ్‌, కృష్ణకాంత్‌, సింగర్‌ శ్రీకృష్ణ, మాలి సహా  సినిమాటోగ్రాఫర్‌ సత్యన్‌ సూర్యన్‌, కొరియోగ్రాఫర్‌ దినేశ్‌ సహ నిర్మాత జగదీష్‌ తదిరులు పాల్గొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆదిపురుష్ షూటింగ్ మొదలు.. ఎప్పుడంటే?