Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నారి సినిమా నుంచి రమణ గోగుల పాడిన గుండెలోన.. సాంగ్ రిలీజ్

Advertiesment
Naari song

దేవి

, బుధవారం, 26 ఫిబ్రవరి 2025 (14:50 IST)
Naari song
ఆమని, వికాస్ వశిష్ఠ, మౌనిక రెడ్డి, ప్రగతి, సునయన, కేదార్ శంకర్, ప్రమోదినీ, తదితరులు కీలక పాత్రల్లో నటించిన సినిమా "నారి". మహిళల్ని గౌరవించాలి, ఆడిపిల్లలు అన్ని రంగాల్లో ఎదిగేందుకు సహకరించాలి, ఇప్పుడున్న సామాజిక పరిస్థితుల్లో 13-20 ఏళ్ల పిల్లలు ప్రమాదంలో ఉన్నారనే విషయాన్నిచెబుతూ దర్శకుడు సూర్య వంటిపల్లి ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రొడ్యూసర్ శ్రీమతి శశి వంటిపల్లి నిర్మించారు.

"నారి" సినిమా మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 7న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఈ సినిమా నుంచి మ్యూజిక్ సెన్సేషన్ రమణ గోగుల పాడిన 'గుండెలోన ఏదో గట్టి సప్పుడైనదే' పాటను రిలీజ్ చేశారు.
 
వికాస్ వశిష్ఠ, మౌనిక రెడ్డిపై ఈ పాటను చిత్రీకరించారు. రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలోని గోదారి గట్టు మీద..పాటతో సెన్సేషన్ సృష్టించిన రమణ గోగుల 'గుండెలోన ఏదో గట్టి సప్పుడైనదే' పాటను పాడటం విశేషం. వినోద్ కుమార్ విన్ను ఈ పాటను బ్యూటిఫుల్ గా కంపోజ్ చేశారు. మహిళా సాధికారత గొప్పదనం చెప్పే కథాంశంతో తెరకెక్కుతున్న "నారి" సినిమా నుంచి ఇప్పటిదాకా రిలీజ్ చేసిన 'ఈడు మగాడేంట్రా బుజ్జి..', 'నిశిలో శశిలా..' సాంగ్స్ హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.  'గుండెలోన ఏదో గట్టి సప్పుడైనదే' పాట కూడా పెద్ద హిట్ కాబోతోంది. ఆర్పీ పట్నాయక్, సునీత, చిన్మయి శ్రీపాద వంటి పేరున్న గాయనీ గాయకులు "నారి" చిత్రంలోని సాంగ్స్ పాడటం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు. 13-20 ఏళ్ల పిల్లలకు వారి తల్లిదండ్రులు తప్పక థియేటర్లలో చూపించాల్సిన చిత్రం "నారి"
 
నటీనటులు - ఆమని, వికాస్ వశిష్ఠ, కార్తికేయ దేవ్, నిత్య శ్రీ, మౌనిక రెడ్డి, ప్రగతి, కేదార్ శంకర్, ప్రమోదినీ, ఛత్రపతి శేఖర్, నాగ మహేశ్, సునైన, రామచంద్ర, రాజశేఖర్, ఫణి, గీతాకృష్ణ రెడ్డి, ధృవన్ వర్మ, రాజమండ్రి శ్రీదేవి, సత్తన్న, వి. లోకేష్, నాగిరెడ్డి, అచ్యుత రామారావు, శేఖర్ నీలిశెట్టి, లడ్డు, గూడ రామకృష్ణ, శ్రీలత, భార్గవి, శ్రీవల్లి, సాయి రేణుక, గీత, మహేశ్, వినయ్, అఖిల్ యడవల్లి, తదితరులు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్టార్ హీరోలతో సినిమాలు చేయాలని ఉంది - విలన్ పాత్రలకు రెడీ : మిమో చక్రవర్తి