బాలీవుడ్ నటి ప్రీతి జింటా తల్లి అయ్యింది. ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది. అద్దె గర్భం ద్వారా ఇద్దరు కవల పిల్లలకు తల్లి అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా ప్రీతి జింటా స్పష్టం చేసింది.
తన పిల్లలకు జై జింటా, గియా జింటా పేర్లు కూడా ప్రీతి జింటా ఫైనల్ చేసింది. ఈ సరోగసి ప్రక్రియలో తమకు సహకరించిన డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందికి స్పెషల్ థ్యాంక్స్ అంటూ ప్రీతి జింటా ట్వీట్ చేసింది.
జీన్ గూడెనఫ్‌తో వివాహానికి అనంతరం ఈ నటి వెండితెరకు దూరంగా ఉంది. అయినప్పటికీ, ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన అభిమానులకు తన అద్భుతమైన చిత్రాలు, వీడియోలతో షేర్ చేసుకుంటుంది.