Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కేతిరెడ్డిని విమర్శిస్తూ.. వర్మ షార్ట్ ఫిల్మ్..(video)

దివంగత నేత, టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా మూడు బయోపిక్‌లు తెరకెక్కనున్నాయి. అందులో రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ఒకటైతే, నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డ

కేతిరెడ్డిని విమర్శిస్తూ.. వర్మ షార్ట్ ఫిల్మ్..(video)
, శుక్రవారం, 10 నవంబరు 2017 (09:30 IST)
దివంగత నేత, టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా మూడు బయోపిక్‌లు తెరకెక్కనున్నాయి. అందులో రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ఒకటైతే, నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డిది రెండోది కాగా, బాలయ్య తీసేది మూడో బయోపిక్ అవుతుంది.

ఈ నేపథ్యంలో కేతిరెడ్డి- రామ్ గోపాల్ వర్మల మధ్య ఎన్టీఆర్ బయోపిక్‌పై పెద్ద వారే జరుగుతోంది. ఇందులో భాగంగా నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డిని విమర్శిస్తూ రాంగోపాల్ వర్మ తయారు చేసిన వ్యంగ్య షార్ట్ ఫిల్మ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
లక్ష్మీ పార్వతి నిద్రిస్తుండగా వచ్చిన ఎన్టీఆర్ ఆత్మ తొలుత ఆమెకు సందేశమిచ్చి.. ఆపై కేతిరెడ్డి కలలోకి వచ్చి వెన్నంటి ఉన్నానని చెప్పడం ఈ వీడియోలో స్పెషల్. "లక్ష్మీ పార్వతిగారూ..." అంటూ ఆమెను నిద్రలేపే ఎన్టీఆర్ ఆత్మ, "ఏం... ఏమది? మా మానసిక ప్రశాంతతకు భంగం వాటిల్లుతుంటే, మీరు ప్రశాంతంగా ఎలా నిద్రపోగలుగుతున్నారు? లేవండి... లేచి మా మాటలు శ్రద్ధగా ఆలకించండి. ఆచరించండి. 
 
మాకు అభిమానపాత్రుడు చిరంజీవి కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి గారు, మా మీదగల అపారమైన గౌరవంతో, అభిమానంతో, ప్రేమతో మామీద చలనచిత్రాన్ని నిర్మించాలని సంకల్పించారు. సత్సంకల్పంతో ఇంతటి బృహత్తర కార్యాన్ని తలపెట్టారు. దాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించడం అవివేకమంటూ పలుకుతుంది. అదే ఆత్మ కేతిరెడ్డిని కూడా తట్టి లేపి సందేశమిస్తుంది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సమంతలో ఇంత మార్పు ఊహించలేదు... నాగార్జున