Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#JaiLavaKusa50Days : "జై" పాత్రలో మెప్పించిన ఎన్టీఆర్..

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో వచ్చిన చిత్రం "జై లవ కుశ". ఈ చిత్రాన్ని నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హీరో, నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించారు. ఇందులో నివేదా థామ

Advertiesment
#JaiLavaKusa50Days :
, గురువారం, 9 నవంబరు 2017 (10:02 IST)
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో వచ్చిన చిత్రం "జై లవ కుశ". ఈ చిత్రాన్ని నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హీరో, నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించారు. ఇందులో నివేదా థామస్, రాశీఖన్నాలు హీరోయిన్లుగా నటించారు. 
 
గత సెప్టెంబర్ 21వ తేదీన విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంతో కెరీర్‌లో ఒక మంచి సక్సెస్‌ను అందుకోవడమేగాక నటుడిగా కూడా తారక్ ఒక మెట్టు పైకెక్కాడు. నెగెటివ్ షేడ్స్ ఉన్న 'జై' పాత్రలో నటించి అందరినీ మెప్పించాడు. ఈ పాత్ర ఎన్టీఆర్ అభిమానులకు చిరకాలం గుర్తుండిపోతుందనడంలో అతిశయోక్తిలేదు.
 
ఈ చిత్రం గురువారంతో 50 రోజులు పూర్తిచేసుకోనుంది. సుమారు రూ.72 కోట్ల షేర్‌ను వసూలు చేసిన ఈ చిత్రం తారక్ కెరీర్‌లోనే రెండో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇకపోతే తారక్ ఈ మధ్యే త్రివిక్రమ్‌తో ఒక సినిమాను లాంచ్ చేశారు. త్రివిక్రమ్ చేస్తున్న పవన్ చిత్రం పూర్తవగానే ఈ చిత్రం మొదలుకానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'గేమ్ ఆఫ్ అయోధ్య'కు ఫిల్మ్ ట్రైబ్యునల్ గ్రీన్ సిగ్నల్.. 24న విడుదల