Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

Manchu Vishnu Reaction On Manoj మంచు ఫ్యామిలీ వివాదాన్ని పెద్దగా చిత్రీకరించవద్దు

manchu vishnu

ఠాగూర్

, మంగళవారం, 10 డిశెంబరు 2024 (11:49 IST)
Manchu Vishnu Reaction On Manoj Vs Mohan Babu Issue మంచు కుటుంబంలో తలెత్తిన వివాదాన్ని భూతద్దంలో చూపించి పెద్దగా చిత్రీకరించవద్దని మీడియాకు హీరో మంచు విష్ణు విజ్ఞప్తి చేశారు. మా ఫ్యామిలీలో చెలరేగిన అన్ని సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 
 
సీనియర్ నటుడు డాక్టర్ మంచు మోహన్ బాబు కుటుంబంలో చెలరేగిన వివాదం ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. తండ్రి కొడుకులు మోహన్ బాబు, మంచు మనోజ్‌లు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. దీంతో మంచు మనోజ్, మంచు మోహన్ బాబుల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన పహాడి షరీఫ్ పోలీసులు మంగళవారం రెండు కేసులను నమోదు చేశారు. 
 
మోహన్ బాబు ఫిర్యాదుతో మంచు మనోజ్, ఈయన భార్య మంచు మౌనిక రెడ్డిలపై పోలీసులు 329, 351 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అలాగే, మనోజ్ ఫిర్యాదు మేరకు మోహన్ బాబు అనుచరులపై కూడా 329, 351, 115 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 
 
ఇదిలావుంటే, విదేశాల నుంచి మంగళవారం ఉదయం హైదరాబాద్ నగరానికి చేరుకున్న మంచు విష్ణు.. రంగారెడ్డి జిల్లా జల్‌పల్లిలోని తన నివాసానికి వెళ్లే మార్గమధ్యంలో మీడియాతో మాట్లాడారు. తమ కుటుంబంలో చిన్నపాటి సమస్యలు తలెత్తాయని, త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. ఫ్యామిలీ వివాదాన్ని పెద్దగా చిత్రీకరించడం తగదని ఆయన మీడియాకు విజ్ఞప్తి చేశారు. 
 
మరోవైపు, ఈ వివాదంపై కూడా డాక్టర్ మోహన్ బాబు కూడా స్పందించారు. ఏ ఇంట్లోనైనా అన్నదమ్ముల మధ్య గొడవలు సహజమేనని, ఇళ్లలో గొడవలు జరిగితే అంతర్గతంగా పరిష్కరించుకుంటామని తెలిపారు. మా ఇంట్లో జరుగుతున్న చిన్న తగాదా ఇది, పరిష్కరించుకుంటామన్నారు. గతంలో ఎన్నో కుటుంబాల సమస్యలు పరిష్కరించి, అందరూ కలిసివుండేలా చేశానని చెప్పారు. పైగా, అన్నదమ్ముల మధ్య గొడవలు సహజమేనని చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మోహన్ బాబు పెద్దరాయుడి పెద్దరికం మంచులా కరిగిపోతుందా?